Pakistan: దాయాది దేశం పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఆదాయం కోసం ప్రజలపైనే భారం వేసేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధపడింది పాకిస్తాన్‌లో ఇంధనం, ఆహార ధరలలో పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణం 1.30 పెరిగింది. వార్షిక ద్రవ్యోల్బణం 29.83 శాతానికి పెరిగిపోయింది. పాకిస్తాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (పీబీఎస్) ప్రకారం, సున్నితమైన ధరల సూచిక (ఎస్‌పీఐ) పెరుగుదలకు టమోటాలు (16.85 శాతం), ఎల్‌పీజీ (9.82 శాతం), పెట్రోల్ (7.86 శాతం) ధరలు పెరగడమే కారణమని పేర్కొంది. డీజిల్ (7.82 శాతం), కారంపొడి (7.58 శాతం), వెల్లుల్లి (5.71 శాతం), ఉల్లి (5.50 శాతం), పొడి పాలు (5.17 శాతం), గుడ్లు (3.86 శాతం), బాస్మతి బియ్యం (2.06 శాతం) పెరగడం కూడా వార్షిక ద్రవ్యోల్బణం పెరగడానికి కారణమని తెలిపింది. మరోవైపు ఆవాల నూనె (1.63 శాతం), చికెన్ (1.40 శాతం), కూరగాయల నెయ్యి 1 కేజీ (0.51 శాతం), కూరగాయల నెయ్యి 2.5 కిలోలు (0.36 శాతం), పప్పుధాన్యాల ధరలు కాస్త తగ్గాయి. (0.22 శాతం), గోధుమ పిండి (0.20 శాతం), పెసరపప్పు (0.03 శాతం) ధరలు కాస్త తగ్గాయి. దేశంలోని 17 నగరాల్లోని 50 మార్కెట్ల నుంచి 51 వస్తువుల ధరలను సేకరించడం ద్వారా పాకిస్తాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ సున్నితమైన ధరల సూచికను గణించింది. వారంలో 51 వస్తువులలో 23 (45.10%) వస్తువుల ధరలు పెరిగాయి. 7(13.72%) వస్తువులు తగ్గగా.. 21 (41.18%) వస్తువుల ధరలు మారలేదు. ఈ వస్తువులలో పాలు, చక్కెర, కట్టెల ధరలు పెరిగాయి. గోధుమ పిండి, కూరగాయలు, నెయ్యి ధరలు తగ్గాయి. అయితే బట్టలు, విద్యుత్ ధరలు మారలేదని తెలిసింది.
Also Read: Tamilnadu: ఆలయంలోకి వితంతు మహిళల ప్రవేశంపై నిరాకరణ.. హైకోర్టు సీరియస్
ఉత్తర భారత్ లాగానే పాకిస్థాన్‌లో కూడా ప్రజల ప్రధాన ఆహారం గోధుమలు. తమకు అవసరమైన గోధుమలను పాకిస్థానీలే పండించుకుంటారు. మిగిలినదాన్ని ఎగుమతి కూడా చేస్తారు. కానీ.. గత ఏడాది పాకిస్థాన్‌ను ముంచెత్తిన వరదల దెబ్బకు లక్షలాది ఎకరాల్లో పంటలన్నీ నీటమునిగిపోయాయి. ఏడాది పొడుగునా వాడుకోవడం కోసం రైతులు ఇళ్లల్లో దాచుకున్న గోధుమలు కూడా తడిసి ముద్దయిపోయాయి. అయితే, పంజాబ్ ప్రాంతంలో వరదల తీవ్రత అంతగా లేనందున.. ఈ ఏడాది ఆహార సంక్షోభం రాదనే పాకిస్థాన్ ప్రభుత్వం భావించింది. దీంతో దిగుమతులపై పెద్దగా దృష్టి సారించలేదు. క్రమంగా దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో ఇప్పుడు దిగుమతి చేసుకోవాలన్నా తగినంత విదేశీ మారక ద్రవ్య నిల్వలు లేని పరిస్థితి. కారణమేదైనా గోధుమలకు తీవ్ర కొరత ఏర్పడడంతో వాటి ధరలు విపరీతంగా, పేదలు భరించలేనంతగా పెరిగిపోయాయి. గత వారం గోధుమల ధరలు కాస్త తగ్గినా అది పాకిస్థాన్ ప్రజలకు ఊరట కలిగించే విషయమేమీ కాదు.
నార్త్ నజీమాబాద్‌కు చెందిన సకీనా అనే గృహిణి మాట్లాడుతూ.. తన పిల్లలకు ముఖ్యంగా మాంసాహారాన్ని వండిపెట్టాలో తనకు తెలియదని చెప్పారు. అంతలా ధరలు పెరిగిపోయాయన్నారు. ఎదుగుతున్న పిల్లలున్నారని, అతి తక్కువ జీతంతో వంటగదిని నడపడం అసాధ్యంగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.