Infinix Note 50x: గేమింగ్ లవర్స్, స్టైలిష్ ఫోన్ యూజర్స్ కోసం ఇన్ఫినిక్స్ కంపెనీ బెస్ట్ ఆప్షన్‌గా ఇన్ఫినిక్స్ నోట్ 50X 5G ఇండియాలో మార్చి 27న అధికారికంగా లాంచ్ చేయబోతోంది. కంపెనీ తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. 2024 ఆగస్టులో వచ్చిన ఇన్ఫినిక్స్ నోట్ 40X 5Gకి ఇది అప్‌గ్రేడెడ్ వెర్షన్. మరి మార్చి 27న రాబోయే ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు వాటి వివరాల గురించి పూర్తిగా తెలుసుకుందాం.
Read Also: Rishabh Pant: రిషబ్ పంత్ తప్పిదాలు.. లక్నో ఓనర్ ఏమన్నాడంటే?
ఈ ఇన్ఫినిక్స్ నోట్ 50X 5Gలో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ కలిగి ఉంది. ఇది 2.5GHz క్లాక్ స్పీడ్‌తో పనిచేస్తుంది. ఇక ఈ మొబైల్ లో గేమింగ్ ప్రేమికుల కోసం ప్రత్యేకంగా మాలి-G615 MC2 GPUను అందించనున్నారు. గేమింగ్‌ను సపోర్ట్ చేసే ఈ GPU తో మరింత మెరుగైన గేమింగ్ అనుభూతిని పొందొచ్చు. ఇక ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 బేస్డ్ XOS 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తోంది. కొత్త యానిమేషన్స్, కస్టమైజేషన్ ఆప్షన్లు ఇందులోని ప్రత్యేకతలు.
ఇన్ఫినిక్స్ ఈ సారి AI ఫీచర్లను మరింతగా మెరుగుపరిచినట్లుగా కనపడుతుంది. వినియోగదారులకు అనుగుణంగా ఐకాన్ల షేప్, సైజ్, కలర్ సులువుగా మార్చుకోవచ్చు. ఈ మొబైల్లో ఉన్న ప్రత్యేకమైన ఫీచర్ ‘యాక్టివ్ హాలో లైటింగ్’. ఇది LED రింగ్ లాంటిది. ఫోన్ వెనుక కెమెరా చుట్టూ ఉంటుంది. నోటిఫికేషన్లు వచ్చినప్పుడు, ఛార్జింగ్ పెట్టినప్పుడు, సెల్ఫీ టైమర్ అమర్చినప్పుడు, గేమింగ్ సమయంలో ఇలా అనేక సందర్భాల్లో దీని లైటింగ్ చేంజ్ అవుతుంది. ఇండియాలోనే మొట్టమొదటిసారిగా “జెమ్-కట్” ఆక్టాగోనల్ కెమెరా మోడ్యూల్ లో రానుంది.
Read Also: Mad Square: మ్యాడ్ స్క్వేర్ ట్రైలర్ విడుదల వాయిదా
Design aisa, ki bas ise dekhte reh jaoge!👀
The Infinix Note 50x 5G+ launches on 27th March in exquisite Vegan Leather and Metallic Finishes.
Kitna excited ho?? 🤔
Link Yahan Hai: https://t.co/LzBFMk0kjP#NOTEkaro #Note50x5G pic.twitter.com/gBVqsO6xKQ
— Infinix India (@InfinixIndia) March 24, 2025
ఈ ఫోన్ 5,100mAh బ్యాటరీతో రానుంది. దీని ద్వారా యూజర్లు ఎక్కువ సమయం పాటు గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ ఎంజాయ్ చేయవచ్చు. ఛార్జింగ్ సపోర్ట్ ఎంత ఉంటుందనేది త్వరలో వెల్లడికానుంది. ఇక గత ఏడాది వచ్చిన ఇన్ఫినిక్స్ నోట్ 40X 5Gలో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 6.78-అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే (120Hz రిఫ్రెష్ రేట్), 108MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఉన్నాయి. దీని ధర రూ.14,999 (8GB + 256GB వేరియంట్). అయితే ఈ సరి రాబోయే నోట్ 50X 5G ప్రాసెసర్, డిజైన్, సాఫ్ట్‌వేర్ అన్నింటిలోనూ మెరుగైన అప్‌గ్రేడ్స్‌తో రానుంది. ఇక ఈ ఇన్ఫినిక్స్ నోట్ 50X 5G ధరపై ఇంకా అధికారిక సమాచారం లేదు. అయితే, ఇది రూ.15,000-రూ.18,000 మధ్య ఉండే అవకాశం లేకపోలేదు. మరిన్ని వివరాలు మార్చి 28న తెలియనున్నాయి.