NTV Telugu Site icon

CM Kejriwal: పంజాబ్‌లో పరిశ్రమలు అభివృద్ధి చెందుతున్నాయి.. లక్షలాది మంది యువతకు ఉపాధి

Kejrival

Kejrival

గురువారం అమృత్‌సర్‌లో ప్రభుత్వ-సన్నత్కర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పారిశ్రామికవేత్తలతో సంభాషించారు. అందులో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. అమృత్‌సర్‌ను గురువుల పవిత్ర భూమిగా పరిగణిస్తామన్నారు. ఈ పవిత్ర భూమి నుండి గురువుల ఆశీర్వాదంతో తాము పంజాబ్ మొదటి స్కూల్ ఆఫ్ ఎమినెన్స్‌ని ప్రారంభించామన్నారు. ఇప్పుడు తాము పరిశ్రమ, వాణిజ్యాన్ని విస్తరించడానికి కూడా కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రపంచం పురోగమిస్తోంది కానీ.. పంజాబ్ ఇప్పటికి వెనుకపడి ఉంది. ఇప్పుడు మనం దానిని మార్చాలన్నారు. ఆప్ ప్రభుత్వం ఏర్పాటైన ఐదేళ్లలోపు దీని సంఖ్యను 2 వేల యూనిట్లకు పెంచుతామన్నారు.

Vijay: తండ్రికి గుండె ఆపరేషన్.. విదేశాల నుంచి వచ్చిన హీరో

ఎన్నికలకు ముందు టౌన్ హాల్ చేశామని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఇందులో పలువురు పారిశ్రామిక వేత్తలు తమ సమస్యలను తెలియజేసి సూచనలు కూడా చేశారు. పరిశ్రమకు ఇచ్చిన అనేక హామీలను నెరవేర్చామని, నిజానికి అంతకు మించి చేశామని ఈరోజు పారిశ్రామికవేత్తల మధ్యకు వచ్చామని తెలిపారు. వ్యాపారవేత్తల నుంచి అందిన ఫీడ్‌బ్యాక్ ప్రకారం రోడ్ల నిర్మాణానికి రూ.14-18 కోట్లకు సీఎం భగవంత్ మాన్ ఆమోదం తెలిపారని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. మరోవైపు సీఎం భగవంత్ మాన్ హైదరాబాద్, చెన్నై, ముంబై, బెంగళూరు వెళ్లి పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి చర్చించారని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. పంజాబ్‌లో తమ ప్రభుత్వం ఏర్పడి కేవలం ఒకటిన్నర సంవత్సరాలు మాత్రమే గడిచిందని.. ఈ ఏడాదిన్నర కాలంలోనే రూ.50 వేల కోట్ల పెట్టుబడులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఈ పెట్టుబడి 2.86 లక్షల కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని పేర్కొన్నారు. పంజాబ్‌లో టాటా స్టీల్‌తో సహా అనేక ఇతర పెద్ద పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని కేజ్రీవాల్ అన్నారు.

Bandi Sanjay: జమిలి ఎలక్షన్స్ అంటే మీకు ఎందుకు అంత భయం..

అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చిన హామీ నెరవేరుతోందో లేదో చూసేందుకు వచ్చానని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అన్నారు. ఇందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. అందరూ వాగ్దానాలు చేస్తారు కానీ నెరవేర్చడం లేదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఇప్పటి వరకు ఏయే హామీలను నెరవేర్చారో చెప్పడానికే వచ్చామన్నారు. నేడు పంజాబ్‌లో 80-85 శాతం ఇళ్లకు ఉచిత విద్యుత్‌ అందుతోందని భగవంత్ మాన్ తెలిపారు. పరిశ్రమలకు సంబంధించి మాట్లాడుతూ.. పంజాబ్‌లో పరిశ్రమల విధానాన్ని రూపొందించామని భగవంత్‌ మాన్‌ అన్నారు. వ్యాపారులు ఈ విధానాన్ని ఉపయోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దేశంలోనే తొలిసారిగా రోడ్డు భద్రతా దళాన్ని ఏర్పాటు చేసిన రాష్ట్రంగా పంజాబ్ నిలుస్తుందని చెప్పారు.