NTV Telugu Site icon

Bomb Threat: జబల్‌పూర్‌ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఫ్లైట్కు బాంబు బెదిరింపులు..

Indigo Flight

Indigo Flight

జబల్‌పూర్ నుంచి హర్యానా వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో.. ఫ్లైట్ను నాగ్‌పూర్‌కు దారి మళ్లించారు. బాంబు బెదిరింపు వచ్చిన విమానం.. ఇండిగో 6ఈ 7308గా గుర్తించారు. విమానాన్ని నాగ్‌పూర్‌లో ల్యాండ్ చేసి ప్రయాణికులందరినీ సురక్షితంగా దింపారు. ఆ తరువాత.. వారికి అవసరమైన భద్రతా తనిఖీలు చేపట్టారు. అంతకుముందు ఆగస్టు 22న బాంబు బెదిరింపు రావడంతో తిరువనంతపురం విమానాశ్రయంలో ఎమర్జెన్సీ విధించారు. సమాచారం ప్రకారం.. విమానం నాగ్‌పూర్ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత ప్రయాణికులను సురక్షితంగా ల్యాండ్ చేశారు. విమానయాన సంస్థ ప్రయాణికులకు విచారం వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేసింది. ఈ సమయంలో ప్రయాణికుల సౌకర్యార్థం పూర్తి జాగ్రత్తలు తీసుకున్నట్లు ఎయిర్‌లైన్స్ తెలిపింది. అసౌకర్యానికి విమానయాన సంస్థ క్షమాపణలు చెప్పింది.

Read Also: NBK50Years: బాలయ్య ఈ రికార్డ్స్ ను బద్దలు కొట్టడం ఎవరివల్ల కాదు.. అవేంటో తెలుసా.?..?

కాగా.. ప్రతిరోజూ ఆసుపత్రులు, విమానాలపై బాంబులు పెట్టామంటూ దుండగులు బెదిరింపులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే.. జూన్ 18న ఏకంగా 41 విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈమెయిల్ ద్వారా బెదిరించారు. అందులో.. జైపూర్, చెన్నై, వారణాసి విమానాశ్రయాలు కూడా ఉన్నాయి. తర్వాత విచారణలో అది ఫేక్ అని తేలింది. చాలా సార్లు.. ఇటువంటి బెదిరింపుల కారణంగా విమానాల రాకపోకలు నిలిచిపోయాయి.

Read Also: Cancelled Trains: వర్షాల ఎఫెక్ట్.. రద్దైన రైళ్ల వివరాలు ఇవే..

బెదిరింపులకు పాల్పడే ప్రయాణికుల్లో ఎవరైనా ఉంటే.. వారిపై ఐదేళ్లపాటు విమానయాన నిషేధం విధించాలని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రతిపాదించింది. ఈ క్రమంలో.. జూన్ 17న 13 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టుపై బాంబులు వేస్తామని బాలుడు బెదిరించారు. దీంతో.. విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ప్రకటించాల్సి వచ్చింది. గతంలో ముంబై సహా పలు నగరాల్లోని 60 ఆసుపత్రులను బాంబులతో పేల్చేస్తామని బెదిరించారు. ఇందులో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు కూడా ఉన్నాయి. ఈ ఇమెయిల్‌లు వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (VPN) ద్వారా ఆసుపత్రి పబ్లిక్ ఇమెయిల్ IDకి పంపించారు.

Show comments