Indigo : ప్రస్తుతం ఇండిగో విమానంలో కుషన్ లేకుండా సీటు ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విమానంలో కూర్చున్న ఓ ప్రయాణికురాలు ఈ విషయాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో షేర్ చేశారు. ఆ తర్వాత వినియోగదారులు ఇండిగో ఫ్లైట్ సేవకు సంబంధించి అనేక ప్రశ్నలను లేవనెత్తారు. నిజానికి బెంగళూరు నుంచి భోపాల్ వెళ్లే ఇండిగో విమానంలో యవనిక అనే మహిళ సీటు బుక్ చేసుకుంది. విమానంలోకి అడుగుపెట్టి సీటు చూడగానే ఆమె షాక్ కు గురైంది. తన సీటుపై కుషన్ లేదు. వెంటనే కుషన్ లేకుండా కూర్చున్న సీటును ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Read Also:Prasanna Vadanam : మరో కొత్త కాన్సెప్ట్‌తో సుహాస్ ‘ప్రసన్న వదనం’.. ఆకట్టుకుంటున్న టీజర్..
మహిళ పోస్ట్ వైరల్ అయిన వెంటనే.. ఇంటర్నెట్‌లో చర్చ ప్రారంభమైంది. ఆ తర్వాత ఇండిగో కూడా క్లారిటీ ఇచ్చింది. యవనిక పోస్ట్‌పై ఇండిగో స్పందిస్తూ, “క్లీనింగ్ ప్రయోజనాల కోసం విమానానికి ముందు సీట్ల కుషన్‌లు మార్చబడ్డాయి. మా క్యాబిన్ సిబ్బంది వెంటనే ఈ సీట్లు కేటాయించిన కస్టమర్లకు సమాచారం అందించారు.” అయితే, తర్వాత సీటుపై కుషన్‌ను అమర్చారు. మహిళా ప్రయాణీకుల ఈ పోస్ట్‌ను ఇప్పటివరకు 10 లక్షలకు పైగా వినియోగదారులు చూశారు.
Beautiful @IndiGo6E — I do hope I land safely! 🙂
This is your flight from Bengaluru to Bhopal 6E 6465. pic.twitter.com/DcPJTq3zka— Yavanika Raj Shah (@yavanika_shah) March 6, 2024
Read Also:Star Hero: కోట్లు సంపాదించినా ఫోన్ వాడని స్టార్ హీరో ఎవరో తెలుసా?
విమానంలో సీట్లకు కుషన్ లేకపోవడం ఇదే మొదటి సారి కాదు. గత ఏడాది ప్రారంభంలో సాగరిక పట్నాయక్ అనే ప్రయాణికుడు కూడా ఇదే సమస్యను ఎదుర్కొన్నాడు. నవంబర్ 26న ఆమె పూణె నుండి నాగ్‌పూర్‌కు ఇండిగో విమానం ఎక్కినప్పుడు ఇలాగే జరిగింది. తన సీటు పై కూడా కుషన్ లేదు. అప్పుడు ఆమె భర్త ఆమె ఫోటో తీసి ఇంటర్నెట్‌లో షేర్ చేశాడు. అతను ఇలా వ్రాశాడు.. “దీని కారణంగా నా భార్య చాలా కాలం నిలబడవలసి వచ్చింది. అనంతరం గ్రౌండ్ స్టాఫ్ సీటు కుషన్లను ఏర్పాటు చేశారు. టేకాఫ్‌కి ముందు ఇండిగో ఈ విషయాలను జాగ్రత్తగా చూసుకోలేదా?’’ అని రాసుకొచ్చాడు.