WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్ ఆ జట్ల మధ్యే.. టీమిండియా మాజీ క్రికెటర్ జోస్యం
- WTC 2023-25 టైటిల్ మ్యాచ్‌లో ఇండియా-ఆస్ట్రేలియా మరోసారి ఢీకొంటాయి- దినేష్ కార్తీక్
- భారత్‌కు తమ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఇది ఒక అవకాశం- డీకే
- జూన్ 11-15 మధ్య ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మూడో ఎడిషన్ టైటిల్ మ్యాచ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో పాయింట్ల పట్టికలో ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు ఇంగ్లండ్-శ్రీలంక మధ్య టెస్టు సిరీస్ జరుగుతుండగా.. తాజాగా బంగ్లాదేశ్ పాకిస్థాన్‌ను ఓడించి టాప్-5లో చోటు దక్కించుకుంది. ఈ క్రమంలో.. టాప్-2లో చోటు దక్కించుకోవాలని ప్రతి జట్టు ప్రయత్నిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి డబ్ల్యూటీసీలో ఏ రెండు జట్లు ఫైనల్ ఆడతాయో క్రికెట్ పండితుల అంచనా ప్రక్రియ మొదలైంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మూడో ఎడిషన్ టైటిల్ మ్యాచ్ ఈసారి జూన్ 11-15 మధ్య లార్డ్స్ మైదానంలో జరగనుంది. దీనిని ‘మక్కా ఆఫ్ క్రికెట్’ అని పిలుస్తారు. టైటిల్ మ్యాచ్‌కి జూన్ 16 రిజర్వ్ డే ఉంది. ఈ క్రమంలో.. టీమిండియా మాజీ క్రికెటర్ ఈసారి డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడగల టీమ్లు ఏంటో చెప్పాడు.
Read Also: Delhi: కాంగ్రెస్‌లో చేరిన భారత రెజర్లు వినేష్ ఫోగట్, పునియా.. హర్యానా నుంచి బరిలోకి..!
Also Read
- Shreyas Iyer: "ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం".. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
- CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
WTC 2023-25 టైటిల్ మ్యాచ్‌లో ఇండియా, ఆస్ట్రేలియా మరోసారి ఢీకొంటాయని దినేష్ కార్తీక్ అభిప్రాయపడ్డాడు. ఇప్పటి వరకు టీమిండియా రెండుసార్లు డబ్ల్యూటీసీ ఫైనల్స్ ఆడింది. అయితే.. రెండు సార్లు టీమిండియా ట్రోఫీని అందుకోలేకపోయింది. మొదటి డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత్‌ను న్యూజిలాండ్ ఓడించగా.. రెండోసారి కంగారూల చేతిలో పరాజయం పాలైంది.
Read Also: Shivraj Singh Chauhan: రైతులకి సహాయం చేయడం అంటే దేవుడికి పూజ చేసినట్లే..
క్రిక్‌బజ్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోలో దినేష్ కార్తీక్ మాట్లాడుతూ.. “ఆస్ట్రేలియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకుంటుందని నేను భావిస్తున్నాను. భారత్‌కు తమ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఇది ఒక అవకాశం. రెండేళ్ల క్రితం వారు ఓవల్‌లో మమ్మల్ని ఓడించారు. ఈ అవకాశం 2025లో రాబోతుంది. ఇది మళ్లీ రాబోతోంది. భారత్ ఆ అడ్డంకిని దాటాలని.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాను ఓడించాలని నేను నిజంగా కోరుకుంటున్నాను.” అని దినేష్ కార్తీక్ చెప్పాడు. ప్రస్తుత డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికను పరిశీలిస్తే భారత్ 68.52 శాతం పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా 62.50 శాతం పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఈ రెండు జట్ల మధ్య మరోసారి ఫైనల్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
తాజావార్తలు
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు