London: యాక్సిడెంట్‌లో నీతి ఆయోగ్ మాజీ ఉద్యోగి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లండన్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నీతి ఆయోగ్ మాజీ ఉద్యోగి చీస్తా కొచ్చర్ (33) ప్రాణాలు కోల్పోయారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో కొచ్చర్ పీహెచ్‌డీ చేస్తున్నారు. యూనివర్సిటీ నుంచి ఇంటికి సైకిల్‌పై వెళ్తుండగా వెనక నుంచి వచ్చిన ట్రక్ ఢీ కొట్టింది. దీంతో తీవ్ర గాయాలైన కొచ్చర్ అక్కడికక్కడే తుదిశ్వాస విడిచారు. కొచ్చర్ మృతిని నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
లైఫ్ ప్రోగ్రామ్‌లో చీస్తా కొచ్చర్ తమతో కలిసి పనిచేసిందని అమితాబ్ కాంత్ గుర్తుచేశారు. లైఫ్ సైన్స్‌లో పీహెచ్‌డీ చేసేందుకు లండన్ వెళ్లారని… జీవితంలో మరింత ఉన్నత స్థానంలోకి వెళ్లాల్సిన సమయంలో విషాద ఘటన జరిగిందని ఆవేదన వ్యక్తంచేశారు. చీస్తా కొచ్చర్ చాలా తెలివైనవారని.. అంతేకాదు.. ఆమె చాలా ధైర్యవంతురాలు అని చెప్పుకొచ్చారు. ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని ఎక్స్‌లో అమితాబ్ కాంత్ ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read
- The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో 'నాని' విజ్ఞప్తి.!
- Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
- Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
- iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
ఇది కూడా చదవండి: Surabhi : సింగర్‌ని పెళ్లి చేసుకున్న హీరోయిన్..
మార్చి 19వ తేదీన చెత్త తీసుకెళ్లే ట్రక్ కొచ్చర్‌ను ఢీ కొంది. ఆ సమయంలో ఆమె భర్త అక్కడే ఉన్నాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. తీవ్ర గాయాలు కావడంతో కొచ్చర్ అక్కడికక్కడే మృతిచెందారు. లండన్‌లో కొచ్చర్ కాలేజీ నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ ఘటన తమ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది అని చీస్తా కొచ్చర్ తండ్రి లెప్టినెంట్ జనరల్ ఎస్పీ కొచ్చర్ లింక్‌డిన్‌లో రాసుకొచ్చారు. గత ఏడాది సెప్టెంబర్‌లో చీస్తా దంపతులు లండన్ వెళ్లారు. అంతకుముందు గురుగ్రామ్‌లో నివసించారు. ఢిల్లీ యూనివర్సిటీ, అశోక వర్సీటి, యూనివర్సిటీస్ ఆఫ్ పెన్సిల్వేనియా, చికాగోలోనూ చీస్తా కొచ్చర్ చదువుకున్నారు. 2021-23 వరకు నీతి ఆయోగ్‌లో నేషనల్ బిహేవియరల్ ఇన్ సైట్స్ విభాగంలో సీనియర్ సలహాదారుగా పనిచేశారని లింక్‌డిన్ ప్రొఫైల్‌లో రాసుకున్నారు.
Cheistha Kochar worked with me on the #LIFE programme in @NITIAayog She was in the #Nudge unit and had gone to do her Ph.D in behavioural science at #LSE
Passed away in a terrible traffic incident while cycling in London. She was bright, brilliant & brave and always full of… pic.twitter.com/7WyyklhsTA— Amitabh Kant (@amitabhk87) March 23, 2024
తాజావార్తలు
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. నేడు ఆ రాశుల వారికి లాభాలే లాభాలు!
-
KSLU Transgender Reservation: న్యాయ విద్యలో తొలిసారి ట్రాన్స్జెండర్లకు 1% రిజర్వేషన్.. తొలి యూనివర్సిటీగా KSLU
-
Dont Trouble The Trouble : బాలకృష్ణ వాయిస్ ఓవర్‌తో ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’
-
PM Modi Chintan Shibir 2026: వికసిత్ భారత్ 2047పై ఫోకస్.. నేటి నుంచి ప్రధాని మోడీ ‘చింతన్ శిబిర్’
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!