Site icon NTV Telugu

Ayodha Ram Mandir: సచిన్, సింధు, ఆనంద్, ఉష.. అయోధ్య ఆహ్వానం అందుకున్న క్రీడా ప్రముఖుల జాబితా ఇదే!

Ram Mandir Inauguration

Ram Mandir Inauguration

Ayodhya Ram Mandir Guest List: ఎన్నో వివాదాలు, మరెన్నో న్యాయ పోరాటాలను అధిగమించి శ్రీరాముడికి శాశ్వత నివాసాన్ని నిర్మించాలన్న ప్రయత్నం ఎట్టకేలకు నెరవేరబోతోంది. శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. దేశంలోని వివిధ రంగాలకు చెందిన దిగ్గజాలను సోమవారం అయోధ్యలో జరగనున్న ప్రాణప్రతిష్ఠ వేడుకకు ప్రత్యేక అతిథులుగా కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ కార్యక్రమానికి దాదాపు 8,000 మంది అతిథులు రానున్నారు. ఇందులో క్రీడా ప్రముఖులు కూడా ఉన్నారు.

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్, స్ప్రింట్ క్వీన్ పీటీ ఉష, స్టార్ ఫుట్‌బాల్ క్రీడాకారిణి భైచుంగ్ భూటియా, బ్యాట్మింటన్ క్రీడాకారిణి పివి సింధు, మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్, బ్యాట్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌, వెయిట్‌ లిఫ్టర్‌ కరణం మల్లేశ్వరి, స్ప్రింటర్ కవితా రౌత్, పారాలింపిక్ జావెలిన్ త్రోయర్ దేవేంద్ర ఝజారియా, బ్యాట్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్‌ తదితరులకు ఆహ్వానం అందింది.

Also Read: Sania Mirza: షోయబ్ మాలిక్ అక్రమ సంబంధాలతో సానియా విసిగిపోయింది!

క్రికెట్ నుంచి సచిన్ టెండూల్కర్ సహా కపిల్‌ దేవ్‌, సునీల్‌ గవాస్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్‌ ద్రవిడ్‌, అనిల్‌ కుంబ్లే, వీరేంద్ర సెహ్వాగ్, ఎంఎస్ ధోనీ, విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, గౌతమ్ గంభీర్, హర్భజన్ సింగ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, హర్మన్‌ప్రీత్ కౌర్‌లకు అయోధ్య ఆహ్వానం అందింది. అయితే బీసీసీఐ అవార్డ్స్, జనవరి 25 నుంచి ఇంగ్లండ్‌తో మొదటి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎవరు వెలుతారో చూడాలి.

Exit mobile version