Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Rupee Falls: దేశీయ స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా భారత రూపాయి విలువ సోమవారం ఉదయం భారీగా తగ్గింది. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి 23 పైసలు క్షీణించి 92.85 వద్ద ట్రేడయింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 93.47 వద్ద ప్రారంభమైన రూపాయి.. తొలుత 92.43 స్థాయికి చేరినా, ఆ తర్వాత ఒత్తిడికి లోనైంది. శుక్రవారం రూపాయి వరుసగా ఐదో సెషన్లోనూ లాభపడి డాలర్‌తో పోలిస్తే 70 పైసలు పెరిగి 92.62 వద్ద ముగిసింది. నవంబర్ 13న నమోదైన 94.19 స్థాయి నుంచి గత ఐదు సెషన్లలో రూపాయి విలువ 1.6 శాతానికి పైగా పెరిగింది. అయితే సోమవారం అమెరికన్ డాలర్ బలంగా ఉండటంతో రూపాయి తిరిగి నష్టాలను చవిచూసింది.
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర 0.28% తగ్గి బ్యారెల్‌కు 92.38 డాలర్ల వద్ద ట్రేడయింది. డాలర్ ఇండెక్స్ 0.03% క్షీణించి 103.71 వద్ద కొనసాగింది. చమురు ధరలు తగ్గడం తొలుత రూపాయికి కొంత మద్దతిచ్చినా, డాలర్ బలపడటంతో ఆ ఊరట ఎక్కువసేపు నిలవలేదు. దేశీయ స్టాక్ మార్కెట్లలోనూ నష్టాలు నమోదయ్యాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 408.3 పాయింట్లు తగ్గి 83,511.41 వద్ద, నిఫ్టీ 118.90 పాయింట్లు పడిపోయి 25,684.30 వద్ద ట్రేడయ్యాయి. అయితే శుక్రవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIలు) నికరంగా రూ.10,308.42 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.
Also Read
- Janasena vs Janasena: పిఠాపురం జనసేనలో అసమ్మతి సెగలు.. వైస్ చైర్మన్ పదవి రచ్చ.. ఎంపీ పీఏపై దాడి..!
- Anand Mahindra: నో హారన్.. 3 గంటల ట్రాఫిక్ జామ్‌లోనూ ప్రశాంతమే.. ఐజ్వాల్‌లో క్రమశిక్షణకు ఆనంద్ మహీంద్రా ఫిదా!
- UP Elections: ఎన్నికల వేళ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ మధ్య సీట్ల పంచాయితీ..!
- Bisleri on FSSAI Action: వాటర్ వివాదంపై బిస్లరీ వివరణ.. FSSAI చర్యలపై కీలక ప్రకటన!
ఇదిలా ఉండగా.. నవంబర్ 13తో ముగిసిన వారంలో దేశ విదేశీ మారక నిల్వలు 14.205 బిలియన్ డాలర్లు తగ్గి 705.342 బిలియన్ డాలర్లకు చేరినట్లు ఆర్బీఐ వెల్లడించింది. మరోవైపు అక్టోబర్‌లో కీలక మౌలిక రంగాల ఉత్పత్తి 10.9% వృద్ధి చెందింది. బొగ్గు, ఇనుప ఖనిజం, విద్యుత్, సిమెంట్ ఉత్పత్తిలో రెండంకెల వృద్ధి నమోదవడం దీనికి ప్రధాన కారణంగా నిలిచింది.
తాజావార్తలు
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
Janasena vs Janasena: పిఠాపురం జనసేనలో అసమ్మతి సెగలు.. వైస్ చైర్మన్ పదవి రచ్చ.. ఎంపీ పీఏపై దాడి..!
-
Faisal Malik : ‘రామాయణ’ టీం మొత్తానికి షాకిచ్చిన కుంభకర్ణుడు
-
Anand Mahindra: నో హారన్.. 3 గంటల ట్రాఫిక్ జామ్‌లోనూ ప్రశాంతమే.. ఐజ్వాల్‌లో క్రమశిక్షణకు ఆనంద్ మహీంద్రా ఫిదా!
-
UP Elections: ఎన్నికల వేళ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ మధ్య సీట్ల పంచాయితీ..!
ట్రెండింగ్
-
Mohammed Siraj-Gill: సిరాజ్‌ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
WTC పాయింట్ల పట్టికలో భారత్‌కు భారీ షాక్.. టాప్-2 నుంచి న్యూజిలాండ్ ఔట్..!
-
Shubman Gill: అందుకే ముందుగానే డ్రాకు అంగీకరించా.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
IND A vs PAK A: 25 బంతుల్లో 3 పరుగులే.. పాకిస్థాన్‌పై భారత్ ఓటమికి కారణం తిలక్ వర్మనే!
-
Ind vs Pak Controversy: తిలక్ వర్మతో గొడవ.. హర్షిత్ రాణాను స్లెడ్జ్.! పాకిస్థాన్ ఆటగాళ్ల ఓవర్ యాక్షన్..