Indian Railways: రైలులోనే “శోభనం గది”.. డెకరేషన్ మామూలుగా లేదు గురూ.. ఇక్కడే అసలైన ట్విస్ట్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Railways: భారతీయ రైల్వేకి చెందిన ఫస్ట్ ఏసీ కోచ్‌ను రోమాంటిక్ ‘హనీమూన్ సూట్’గా మార్చిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మరోవైపు.. ఈ అంశంపై పెద్ద వివాదం, చర్చకు దారితీసింది. వాస్తవానికి.. నాందేడ్‌గ్రామ్ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 110002) రైలులో ఓ కంపార్ట్మెంట్ను బెలూన్లు, రంగు రంగుల పూలు, వేలాది గులాబీ రేకులతో పాటు “ఐ లవ్ యూ” అనే మెసేజ్‌తో అత్యంత విలాసవంతంగా అలంకరించారు. ఈ రోమాంటిక్ సెటప్ వెనుక ఉన్న అసలు కథ ఇప్పుడు బయటపడింది. మహారాష్ట్రకు చెందిన ‘రాహత్ రూమ్ డెకరేషన్’ అనే ప్రైవేట్ సంస్థ ఈ అలంకరణ చేసినట్లు అంగీకరించింది. జల్నాకు చెందిన ఓ కొత్త జంట కోసం ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వారు తెలిపారు. ఆ జంట ఔరంగాబాద్ నుంచి జల్నా రైల్వే స్టేషన్‌కు చేరుకునే లోపే ఈ డెకరేషన్ చేశారు. ఆ తర్వాత జల్నా స్టేషన్లో ఆ దంపతులు రైలు ఎక్కారు.
అయితే, ఈ అందమైన సర్ప్రైజ్ వెనుక ఉన్న అసలు ట్విస్ట్ ఇప్పుడే మొదలైంది. ఈ వ్యవహారంపై భారతీయ రైల్వే శాఖ తీవ్రంగా స్పందించింది. డెకరేషన్ నిర్వాహకులు ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా రైలు కోచ్‌లోకి ప్రవేశించారని, ఇది రైల్వే నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. ఈ భద్రతా లోపానికి బాధ్యుడిగా చేస్తూ, ఆ సమయంలో విధుల్లో ఉన్న చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ గిరీష్ కుమార్‌ను రైల్వే శాఖ తక్షణమే సస్పెండ్ చేసింది. అంతేకాకుండా, ఈ నిర్లక్ష్యానికి కారణమైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా అంతర్గత శాఖాపరమైన విచారణకు సైతం ఆదేశించింది. ఈ వీడియో ఇంటర్నెట్లో విపరీతమైన మీమ్స్, జోకులకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. నెటిజన్లు ఈ కోచ్‌కు సుహాగ్రాత్ ఎక్స్‌ప్రెస్ అని, హనీమూన్ ఆన్ వీల్స్ అని రకరకాల పేర్లు పెడుతున్నారు. కదిలే రైలులో ఇలాంటి ప్రయోగాలు ఎంతవరకు ప్రాక్టికల్ అంటూ నవ్వుకుంటున్నారు. ఒకవైపు కొందరు తమ ప్రత్యేక క్షణాలను ఇంత గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవడం చాలా బాగుందని ప్రశంసిస్తుంటే, మరికొందరు మాత్రం రైల్వే నిబంధనలను ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ఆస్తి అయిన రైలు కోచ్‌లను ఇలా ప్రైవేట్ వ్యక్తులు తమ ఇష్టమొచ్చినట్లు అలంకరించడానికి అనుమతులు ఎలా ఇస్తారని నిలదీస్తున్నారు. ముఖ్యంగా బెలూన్లు, కాగితాలు, పూలు వంటి వస్తువుల వల్ల అగ్నిప్రమాదాలు జరిగే ముప్పు ఉంటుందని, ఇది తోటి ప్రయాణికుల భద్రతకు, రైలు పరిశుభ్రతకు విఘాతం కలిగిస్తుందని ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
A First AC coach has reportedly been decorated with a "honeymoon-style" setup.
The Railway administration must explain: is it's allowed? @RailMinIndia @RailwaySeva @AshwiniVaishnaw @PMOIndia pic.twitter.com/ofE4AGawJH
— The Nalanda Index (@Nalanda_index) July 7, 2026
తాజావార్తలు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!