Site icon NTV Telugu

Team India: రేపు ప్రధాని మోడీని కలవనున్న భారత ఆటగాళ్లు..

Pm Modi Meet India

Pm Modi Meet India

టీ20 వరల్డ్ కప్ 2024లో భారత్ టైటిల్ సాధించిన విజయం తెలిసిందే.. దీంతో దాదాపు 17 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని టీమిండియా సొంతం చేసుకుంది. జూన్ 29న బార్బడోస్లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో భారత్ ఉత్కంఠ భరిత విజయం సాధించింది. ఇదిలా ఉంటే.. తుఫాన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయిన టీమిండియా, ఈరోజు బార్బడోస్ నుంచి స్వదేశానికి బయల్దేరింది. సుమారు 16 గంటల ప్రయాణం తర్వాత గురువారం ఉదయం 6.00 గంటలకు భారత ఆటగాళ్లు ఢిల్లీ ఎయిర్ పోర్టులో ల్యాండ్ కానున్నారు. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ ట్రోఫీని సాధించిన భారత ప్లేయర్లకు ఘన స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున అభిమానులు ఢిల్లీ ఎయిర్పోర్టుకు చేరుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎయిర్ పోర్టు అధికారులు అలర్ట్ అయ్యారు. దీంతో.. భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

Read Also: Amla Juice : ఈ జ్యూస్ తరుచు తాగారో ఇక రోగాలు రమ్మన్న రావంతే..

మరోవైపు.. టీమిండియా స్వదేశానికి తిరిగొస్తున్న నేపథ్యంలో ‘ఇట్స్ కమింగ్ హోమ్’ అంటూ వరల్డ్ కప్ ట్రోఫీ ఉన్న వీడియోను బీసీసీఐ తాజాగా ఎక్స్ లో షేర్ చేసింది. వరల్డ్ కప్ విన్నర్స్ కు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తుంది. కాగా.. రేపు ఢిల్లీకి చేరుకున్నాక భారత ఆటగాళ్లు ప్రధాని నరేంద్ర మోడీని ప్రత్యేకంగా కలవనున్నారు. ఇప్పటికే.. భారత్ వరల్డ్ కప్ సాధించిన తర్వాత ప్రధాని మోడీ ఫోన్లో భారత ఆటగాళ్లతో మాట్లాడి అభినందించారు. కాగా.. రేపు ప్రధానిని నేరుగా కలవనున్నారు. అనంతరం.. ఢిల్లీ నుంచి ముంబైకు వెళ్లనున్నారు. అక్కడ నిర్వహించబోయే పలు కార్యక్రమాల్లో టీమిండియా పాల్గొననుంది. అందుకోసం బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేస్తుంది.

Read Also: UP Bhole baba: హత్రాస్ భోలే బాబాపై లైంగిక వేధింపుల కేసులు.. బ్యాగ్రౌండ్ ఇదే!

Exit mobile version