భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి అమెరికాలో చేయని నేరానికి ఏకంగా 43 ఏళ్లు జైలు జీవితం గడిపాడు. అమెరికాలో జరిగిన ఈ ఘటన, భారతీయ మూలాలున్న ఒక వ్యక్తి జీవితాన్ని మార్చివేసింది. సుబ్రమణ్యం ‘సుబు’ వేదం అనే ఈ వ్యక్తి, తప్పుడు హత్య కేసులో శిక్షించబడి 43 సంవత్సరాలు జైలులో గడిపాడు. ఇటీవల విడుదలైన ఆయనను… ICE (ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్) అధికారులు అరెస్ట్ చేసి, భారతదేశానికి డిపోర్ట్ చేయాలని నిర్ణయించారు. భారతదేశంలో జన్మించినప్పటికీ, 9 నెలల వయసులోనే అమెరికాకు వచ్చిన ఆయనకు, ఈ దేశం తప్ప మరొక్కటి తెలియదు. ఈ కథ, న్యాయ వ్యవస్థలోని లోపాలు, భారతీయ కమ్యూనిటీలో భావోద్వేగాలు, ఒక కుటుంబం బాధలను ప్రతిబింబిస్తుంది.
ప్రారంభ జీవితం
సుబ్రమణ్యం వేదం, సుబు అని పిలువబడే ఈ వ్యక్తి 1961లో భారతదేశంలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు 1956లో అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలోని స్టేట్ కాలేజ్ పట్టణానికి వచ్చారు. ఆయన తండ్రి పెన్ స్టేట్ యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. తల్లి లైబ్రేరియన్‌గా పనిచేస్తూ, భారతీయ కమ్యూనిటీలో కుకింగ్ క్లాసులు నడుపుతూ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవారు. అప్పట్లో, స్టేట్ కాలేజ్‌లో మొదటి భారతీయ కుటుంబాల్లో ఒకటిగా వేదం కుటుంబం పేరు తెచ్చుకుంది. సుబు కేవలం 9 నెలల వయసులో అమెరికాకు చేరాడు. అక్కడే పెరిగి, పెన్ స్టేట్‌లో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తూ, కోర్సులు చదివాడు. 1980లో, 19 ఏళ్ల వయసులో, ఆయన స్నేహితుడైన థామస్ కిన్సర్తో కలిసి ల్యూవిస్టౌన్ పట్టణానికి వెళ్లాడు. అక్కడ డ్రగ్స్ కొనాలని, కానీ ఏమీ జరగలేదు. కానీ, ఆ రోజు తర్వాత కిన్సర్ మిస్సింగ్ అయ్యాడు. 9 నెలల తర్వాత, 1981 సెప్టెంబరులో అతని మృతదేహం ఒక సింక్‌హోల్‌లో గుర్తించారు. మెదడులో బుల్లెట్ గాయం కనుగొన్నారు. దీంతో అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
తప్పుదారి పట్టిన దర్యాప్తు
1982 మార్చిలో సుబును అరెస్ట్ చేశారు. కానీ, కేసు పూర్తిగా సర్కమ్‌స్టాన్షియల్ ఎవిడెన్స్ మీద ఆధారపడింది. సాక్షులు లేరు, మోటివ్ లేదు, ఆయుధం లేదు, మరణ తేదీ కూడా ఖచ్చితంగా తెలియదు. అయినా, పోలీసులు సుబును మాత్రమే టార్గెట్ చేశారు. మీడియా, ముఖ్యంగా స్థానిక పత్రికలు, ఆయన భారతీయ మూలాలను హైలైట్ చేసి, “ఇండియన్ వాల్యూస్‌తో అమెరికన్ వాల్యూస్ మధ్య టార్న్ సైక్” అని, “అన్‌కంట్రోలబుల్ రేజ్” అని ప్రచారం చేశాయి. ఇది రేసిజం ఆరోపణలకు దారి తీసింది.1983లో ట్రయల్‌లో, సుబుకు లైఫ్ వితౌట్ పేరోల్ శిక్ష విధించారు. అప్పీల్స్ తిరస్కరించబడ్డాయి. 1988లో మళ్లీ ట్రయల్ జరిగింది, కానీ అదే జడ్జి, ప్రాసిక్యూటర్‌తో. డిఫెన్స్‌కు కీలక ఎవిడెన్స్‌లు దాచిపెట్టారు. ఉదాహరణకు, బుల్లెట్ వౌండ్ గన్ కాలిబర్‌తో సరిపోలేదు. ఇవన్నీ 2022లో వెలుగుచూశాయి.
జైలు జీవితం
హంటింగ్డన్ మాక్సిమం సెక్యూరిటీ జైలులో 43 సంవత్సరాలు గడిపిన సుబు, మోడల్ ఇన్మేట్గా మారాడు. ఆయన లిటరసీ ప్రోగ్రామ్‌లు డిజైన్ చేసి, ఇన్మేట్లకు డిప్లొమాలు సాధించేలా సహాయం చేశాడు. బిగ్ బ్రదర్స్ బిగ్ సిస్టర్స్‌కు డబ్బు సేకరించాడు. మూడు డిగ్రీలు పూర్తి చేశాడు. తన సోదరి సరస్వతి వేదం (మిడ్వైఫరీ ప్రొఫెసర్) పెళ్లికి రాలేదు, తల్లిదండ్రుల వృద్ధాప్యంలో సహాయం చేయలేదు, తన సోదరి పిల్లలతో సమయం గడపలేదు. కానీ, ఫోన్, లెటర్స్ ద్వారా కుటుంబంతో టచ్ లో ఉన్నాడు. పెన్ స్టేట్ భారతీయ కమ్యూనిటీ, ఈ కేసు గురించి చర్చించుకోవడం మొదలు పెట్టారు. “ఇండియన్ వ్యక్తి జైలులో ఉండటం, కొత్తగా వచ్చిన మనలాంటి వారికి షాక్” అని భుషణ్ జయరావ్ తెలిపారు. కమ్యూనిటీ స్టోరీ అవర్స్, చాయ్ సమావేశాల్లో ఈ కథ చర్చనీయాంశమైంది.
విడుదల.. కొత్త ఆపద
2025 అక్టోబర్ 3న, 64 ఏళ్ల సుబు జైలు నుంచి విడుదలయ్యాడు. పెన్సిల్వేనియా చరిత్రలో అతి దీర్ఘకాలిక్ ఎక్సోనరీ (నిర్దోషి విడుదల). కానీ, వెంటనే ICE అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. 1980ల నుంచి ఉన్న డిపోర్టేషన్ ఆర్డర్‌ను ఆక్టివేట్ చేశారు. ఎందుకంటే, ఆయన భారతీయ పౌరుడు. జైలు శిక్ష ఉన్నందున డిపోర్ట్ చేయలేదు, కానీ ఇప్పుడు విడుదలైతే… భారతదేశానికి పంపాలి. దీంతో కుటుంబం షాక్‌లో ఉంది. “సుబు జీవితం అమెరికాలోనే సాగింది. భారతదేశంలో కొంత రిలేటివ్స్ ఉండవచ్చు, కానీ అతని కుటుంబం ఇక్కడే” అని సోదరి సరస్వతి చెప్పారు. లాయర్లు ఇమ్మిగ్రేషన్ కోర్టులో కేసు రీఓపెన్ చేయమని, ఎక్సోనరేషన్ను పరిగణించమని అభ్యర్థించారు. ICE “క్రిమినల్ పాస్ట్ కారణంగా అరెస్ట్” అని ప్రకటించింది. సుబు వేదం కథ, అమెరికన్ జస్టిస్ సిస్టమ్‌లోని లోపాలను, ఇమ్మిగ్రేషన్ చట్టాల గందరగోళాన్ని, భారతీయ డయాస్పోరాలో భావోద్వేగాలను చూపిస్తుంది. ఆయన జైలు జీవితాన్ని “సేవా వాహనంగా” మలిచాడు. ఇప్పుడు, కుటుంబం, కమ్యూనిటీ, లాయర్లు డిపోర్టేషన్‌ను ఆపడానికి పోరాడుతున్నారు.