Indian American: చిన్న గొడవకే ప్రియురాలిని కాల్చి చంపిన భారతీయ యువకుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian American Murdered Girl Friend: ఈ మధ్య చిన్న చిన్న గొడవలకే మనుషులు దారుణాలకు ఒడిగడుతున్నారు. విచక్షణ కోల్పోయి ప్రాణాలు తీసేవారు వెళుతున్నారు. మనిషి ప్రాణాలకు విలువ లేకుండా చేస్తున్నారు. ఆవేశంతో తాము ప్రేమించిన వారినే బలి తీసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకుంది. వివరాళ్లోకి వెళ్తే.. అగ్రరాజ్యం అమెరికాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ భారతీయ అమెరికన్ తన ప్రియురాలిని చిన్నపాటి గొడవ కారణంగా కాల్చి చంపాడు. 29 ఏళ్ల సిక్కు యవకుడు ఈ ఘోరం చేశాడు.సిమ్రంజిత్ సింగ్ అనే వ్యక్తి కాలిఫోర్నియాలో ఉంటున్నాడు. గత శనివారం నాడు అతను తన గర్ల్ ఫ్రెండ్ ను తీసుకొని స్థానికంగా ఉండే ఒక షాపింగ్ మాల్ కు వెళ్లాడు. అప్పటి వరకు వారు చాలా సరదగా గడిపారు. అయితే షాపింగ్ ముగించుకొని కారు పార్కింగ్ దగ్గరకు వచ్చిన వారికి అక్కడ ఏదో చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో కోపంతో ఊగిపోయిన ఆ యువకుడు కారులో నుంచి గన్ తీసి ప్రియురాలిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. దాంతో అమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఈ ఘటన అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 10:30 గంటలకు చోటుచేసుకుంది. రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను కాపాడటానికి అతను ప్రయత్నించలేదు. రక్తపు మడుగులో పడివున్న ఆమెను అక్కడే వదిలేశాడు.
Also Read: COVID19: షాకింగ్ సర్వే.. కరోనా నుంచి కోలుకున్న ప్రతి వందమందిలో ఆరుగురు ఏడాదిలోపే మృతి
ప్రియురాలు చనిపోవడంతో భయపడిపోయిన ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం పార్కింగ్ సిబ్బంది ఆ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందిచారు. సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాన్ని పరిశీలించిన పోలీసులు ఆ యువతిని చంపింది సిమ్రంజిత్ అని నిర్థారించుకున్నారు. అతని కోసం గాలించగా అతడు ఓ షాపు దగ్గర ఉన్నట్లు గుర్తించారు. దాంతో అతడిని అరెస్ట్ చేశారు. సిమ్రంజిత్ను బుధవారం ప్లేసర్ కౌంటీ జిల్లా కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుగుతుంది. తన ఆవేశానికి గాను ఆ యువకుడు భారీగానే శిక్ష అనుభవించాల్సి రావచ్చు. అమెరికా చట్టం ప్రకారం అతనికి చాలా సంవత్సరాలు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.
Also Read
తాజావార్తలు
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
-
Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
-
CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్‌లు వైరల్
-
ACB Raids : ట్రాన్స్‌కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!