IND vs BAN: గిల్ శతకం.. భారత్ ఘన విజయం
- ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ బోణీ
- బంగ్లాదేశ్‌పై 6 వికెట్ల తేడాతో విజయం
- బంగ్లాదేశ్ 228, భారత్ 231/4.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. 229 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్ల తేడాతో గెలిచింది. 46.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ (101) సెంచరీతో చెలరేగాడు. దీంతో ఛాంపియ్స్ ట్రోఫీలో భారత్ బోణీ కొట్టింది. భారత్ బ్యాటింగ్‌లో ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించారు. కెప్టెన్ రోహిత్ శర్మ (41) పరుగులు చేశాడు. ఆ తర్వాత.. గిల్‌కు తోడుగా కేఎల్ రాహుల్ (41) మంచి భాగస్వామ్యాన్ని అందించాడు. విరాట్ కోహ్లీ (22), శ్రేయస్ అయ్యర్ (15), అక్షర్ పటేల్ (8) పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో రిషద్ హుస్సేన్ 2 వికెట్లు పడగొట్టగా.. టస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహమన్ తలో వికెట్ తీశారు.
Read Also: ICC: పాకిస్తాన్‌కు షాక్ ఇచ్చిన ఐసీసీ.. కారణమిదే..?
Also Read
మొదట బ్యాటింగ్ చేసినన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లో 228 పరుగులు మాత్రమే చేసింది. బంగ్లా బ్యాటర్లను టీమిండియా బౌలర్లు కట్టడి చేశారు. మహమ్మద్ షమీ బంగ్లా బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. క్రీజులోకి వచ్చిన వాళ్లు వచ్చినట్టు పెవిలియన్‌కు పంపించాడు. బంగ్లాదేశ్ బ్యాటింగ్‌లో తోహిద్ హ్రిదోయ్, జాకీర్ అలీ జట్టును ఆదుకున్నారు. హ్రిదోయ్ సెంచరీ (100) చేయగా.. జాకీర్ అలీ (68) పరుగులు చేశారు. వీరిద్దరి మధ్య 150 పరుగుల భాగస్వామ్యం ఉంది. బంగ్లాదేశ్ బ్యాటింగ్‌లో తంజీద్ హసన్ (25), రిషద్ హుస్సేన్ (18) పరుగులు చేశారు. నలుగురు బ్యాటర్లు ఏమీ పరుగులు చేయకుండానే డకౌట్ అయ్యారు. భారత్ బౌలర్లలో మహమ్మద్ షమీ 5 వికెట్లు తీశాడు. హర్షిత్ రాణా 3, అక్షర్ పటేల్ 2 వికెట్లు పడగొట్టారు. కాగా.. టీమిండియా తర్వాత మ్యాచ్ ఆదివారం పాకిస్తాన్‌తో ఉండనుంది.
తాజావార్తలు
-
OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
-
OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
-
OTR: నెలకు ₹2,000 కోట్లు! చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఇదేనా?
-
US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
-
Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. ‘సంబరాల ఏటిగట్టు’ గ్లింప్స్ మామూలుగా లేదుగా!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!