Kho Kho World Cup: ఖోఖో ప్రపంచకప్ గెలిచిన భారత్.. ఒకటి కాదు రెండు!
- ఖోఖో ప్రపంచకప్ 2025 భారత్‌దే
- ఫైనల్లో 78-40తో నేపాల్‌ను చిత్తు
- 54-36తో నేపాల్‌పై పురుషుల జట్టు విజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొట్టమొదటి ఖోఖో ప్రపంచకప్‌ను భారత్ కైవసం చేసుకుంది. అద్భుత ఆటతో మహిళలు, పురుషుల విభాగాల్లో విజేతగా నిలిచింది. ఆదివారం న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన మహిళల ఫైనల్లో నేపాల్‌ను 78-40తో భారత్ ఓడించింది. ప్రియాంక ఇంగ్లే నేతృత్వంలోని భారత జట్టు ఛేజ్ అండ్ డిఫెన్స్ రెండింటిలోనూ ఆధిపత్యం చెలాయించి మొట్టమొదటి ఖోఖో ప్రపంచకప్‌ను గెలుచుకుంది.
ఫైనల్లో భారత్ 34-0తో ఆధిక్యాన్ని సాధించింది. నేపాల్ పుంజుకుని 35-24తో రేసులోకి వచ్చింది. ఈ సమయంలో కెప్టెన్ ప్రియాంక ఇంగ్లే, వైష్ణవి రాణించడంతో విమెన్ ఇన్ బ్లూ 49 పాయింట్ల భారీ ఆధిక్యానికి దూసుకెళ్లింది. చివరకు 78-40తో గెలిచింది. టోర్నీలో భారత మహిళల జట్టు అజేయంగా నిలిచింది. గ్రూప్ ఎలో ఉన్న భారత్ మూడు విజయాలతో అగ్రస్థానంలో నిలిచింది. దక్షిణ కొరియాపై 157 పాయింట్ల విజయం (175-18), ఇరాన్‌పై 84 పాయింట్ల విజయం (100-16), మలేషియాపై 80 పాయింట్ల విజయం (100-20)ను నమోదు చేసింది. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాను 66-16తో ఓడించి ఫైనల్స్‌లోకి ప్రవేశించింది.
Also Read
పురుషుల ఫైనల్లో భారత్ 54-36తో నేపాల్‌పై గెలిచింది. ఆరంభంలో ఎటాకింగ్ గేమ్ ఆడిన భారత్.. 26-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తర్వాత నేపాల్ పుంజుకుంది. దూకుడు కొనసాగించిన భారత్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఖోఖో ప్రపంచకప్ కైవసం చేసుకున్న భారత జట్లను ప్రధాని మోడీ అభినందించారు. ఈ విజయం యువతరానికి స్ఫూర్తి అని ఎక్స్‌లో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
-
Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్!
-
Mahindra XUV 3XO CNG: మారుతి, టాటాలకు గట్టి పోటీ.. మహీంద్రా XUV 3XO CNGని తెస్తోందా?
-
Harish Rao : తుగ్లక్ నిర్ణయాలతో బొగ్గు ఉత్పత్తి పడిపోయింది..
-
TG SAFE : పండుగ వేళ అప్రమత్తమైన TG SAFE, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!