Non Veg Milk: మీరు ఎప్పుడైనా “నాన్ వెజ్ మిల్క్” అనే పేరు విన్నారా..? అసలు నాన్ వెజ్ మిల్క్ ఉంటాయా..? అని ఆశ్చర్యపోతున్నారా! కానీ, నాన్ వెజ్ పాలు ఉన్నాయ్. ఈ నాన్ వెజ్ మిల్క్ కారణంగానే అమెరికాతో భారత్ బిజినెస్ డీల్ కు బ్రేక్ పడింది. అసలు నాన్ వెజ్ మిల్క్ అంటే ఏంటి..? దీని వల్ల అమెరికాతో భారత్ డీల్ కు ఎందుకు బ్రేక్ పడింది..?
మనం రోజూ టీలో, కాఫీలో, లేదా పెరుగులో వాడే పాలు ఆవులు లేదంటే గేదెల నుంచి వస్తాయి. అవి పూర్తిగా శాఖాహారం. మరి నాన్ వెజ్ మిల్క్ అంటే ఏంటి..? ఇవి ఎక్కడి నుంచి వస్తాయి అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి. మనం ఆవులకు గడ్డి, గింజలు, పప్పులు వంటివాటిని దాణాగా వేస్తాం. కానీ, అమెరికాలో కొన్ని ఫామ్‌లలో ఆవులకు మాంసం, చేపలు, కోళ్ల ఈకలు, జంతు వ్యర్థాలు కలిపిన ఆహారం ఇస్తారు. ఈ ఆహారం వల్ల ఆవులు ఎక్కువ పాలు ఇస్తాయని, అవి బలంగా ఉంటాయని అమెరికన్ రైతులు చెబుతారు. అలాంటి ఆవుల నుంచి వచ్చే పాలనే “నాన్ వెజ్ మిల్క్” అని పిలుస్తున్నారు. కానీ మన దేశంలో ఆవు పవిత్రం, దాని పాలు స్వచ్ఛమైనవి. అందుకే ఈ నాన్ వెజ్ మిల్క్ ఆలోచనే మనకు వింతగా అన్పిస్తుంది.
Hari Hara Veera Mallu: అఫిషియల్.. హరిహర వీరమల్లు ప్రీ-రిలీజ్ ఈవెంట్ అతిథులు వీళ్లే..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌తో బిజినెస్ డీల్ చేయాలని చూస్తున్నారు. కానీ, ఈ నాన్ వెజ్ మిల్క్ విషయంలో రెండు దేశాల మధ్య ప్రతిష్టంభన నెలకొంది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య ఈ అంశంపై చర్చలు జరుగుతున్నాయి. ప్రపంచంలోనే పెద్ద డెయిరీ ఎగుమతి దేశాల్లో అమెరికా ఒకటి. 2024లో వాళ్లు దాదాపు 60 వేల కోట్ల రూపాయల విలువైన పాలు, పాల ఉత్పత్తులను ఇతర దేశాలకు అమ్మారు. ఇప్పుడు వాళ్లు భారత డెయిరీ మార్కెట్‌లోకి రావాలని చూస్తున్నారు. ఎందుకంటే, భారత్‌లో పాల ఉత్పత్తుల మార్కెట్ విలువ సుమారు 1.2 లక్షల కోట్ల రూపాయలు. ఇంతపెద్ద మార్కెట్ లోకి ప్రవేశించడం ద్వారా అమెరికాకు భారీ లాభం చేకూరుతుంది. అందుకే భారత్ తో పెద్ద బిజినెస్ డీల్ చేసుకోవాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా అమెరికా నుంచి నాన్ వెజ్ మిల్క్ తో పాటు, దానితో చేసిన చీజ్, వెన్న, ఐస్‌క్రీమ్ వంటివి భారత్‌లో అమ్మాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ఉత్పత్తులపై సుంకాలు తగ్గించాలని, దిగుమతులకు ఆటంకాలు లేకుండా చూడాలని కోరుతున్నారు. 2030 నాటికి భారత్‌తో వాణిజ్యాన్ని 3.5 లక్షల కోట్ల రూపాయలకు పెంచడం అమెరికా లక్ష్యం. అందుకే నాన్ వెజ్ మిల్క్ ను భారత్‌లో అమ్మడానికి ఒత్తిడి చేస్తున్నారు.
పాలు, పాల పదార్థాలు లేకుండా భారతీయులు ఉండలేరు. పాలు, పెరుగు, నెయ్యి మన జీవన విధానంలో ఒక భాగం. పూజలు, హోమాలు, నైవేద్యాలు.. ఇలా ప్రతి దాంట్లో పాలు, నెయ్యి ఉండాల్సిందే. అలాంటి పవిత్రమైన పాలలో మాంసం కలిస్తే…అస్సలు ఆ ఊహనే మనం జీర్ణించుకోలేం. భారత్‌లో ఆవు పవిత్ర జంతువు. దాని పాలు మన సంస్కృతిలో ఒక ముఖ్య భాగం. దేవాలయాల్లో పాలతో అభిషేకం చేస్తాం, నెయ్యితో దీపం వెలిగిస్తాం. నైవేద్యాల్లో పాలు, నెయ్యి విరివిగా వాడతాం. ఇప్పుడు మాంసం తినే ఆవుల నుంచి తీసిన పాలను వాడాలంటే అది పెద్ద అపచారం. అలాంటి పాలు మన ఆచారాలకు విరుద్ధం. భారత్‌లో దాదాపు 30శాతం మంది పూర్తి శాఖాహారులు. వాళ్లు నాన్ వెజ్ మిల్క్ తో చేసిన పెరుగు, చీజ్ లాంటివి తినలేరు. అందుకే నాన్ వెజ్ మిల్క్ ను దిగుమతి చేసుకునే ప్రసక్తే లేదని భారత్, అమెరికాకు తేల్చి చెప్పేసింది. అంతేకాక, అమెరికా నుంచి దిగుమతి చేసుకునే పాల విషయంలో కఠినమైన నాణ్యత తనిఖీలు, సర్టిఫికేషన్‌లు కావాలని భారత్ స్పష్టం చేసింది.
Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లును టార్గెట్ చేస్తున్నారు.. ఏఎం రత్నం షాకింగ్ కామెంట్స్
ఉదయం లేవగానే కాఫీ, టీ మొదలు రాత్రి నిద్రపోయేవరకూ మన ఆహారంలో పాలు, పెరుగు, నెయ్యి లాంటి వాటిని విస్తృతంగా వాడుతుంటాం. అంతేకాదు.. పాల ఉత్పత్తిలో కూడా మనం అందరికంటే ముందున్నాం. ప్రపంచంలోనే పాలు అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాల్లో భారత్ నెంబర్ వన్ స్థానంలో ఉంది. 2023లో మనం సుమారు 23 కోట్ల టన్నుల పాలను ఉత్పత్తి చేశాం. ఇది ప్రపంచంలోని మొత్తం పాల ఉత్పత్తిలో దాదాపు 25శాతం. దాదాపు 8 కోట్ల మంది చిన్న సన్నకారు రైతులు పాడిపరిశ్రమ రంగంలో పనిచేస్తున్నారు. పాలు, పెరుగు, నెయ్యి, చీజ్, ఐస్‌క్రీమ్ లాంటివాటిని మనం నిత్యం ఉపయోగిస్తుంటాం. పండగల్లో, పూజల్లో, ఇంట్లో రుచికరమైన స్వీట్లు చేయడానికి పాలు తప్పనిసరి. అందుకే మనం పాలను ఆరోగ్యానికి, సంస్కృతికి, సంప్రదాయానికి చిహ్నంగా చూస్తాం.
ఒకవేళ భారత్ అమెరికా నుంచి నాన్ వెజ్ మిల్క్ దిగుమతి చేసుకుంటే మనకు అనేక బ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మన సంస్కృతి సంప్రదాయాలకు పెద్ద విఘాతం కలుగుతుంది. అంతేకాదు, మన రైతులు కూడా భారీగా నష్టపోతారు. అమెరికా నుంచి నాన్ వెజ్ మిల్క్ దిగుమతి చేసుకుంటే భారత్ అనేక విధాల నష్టపోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా రైతులు భారీగా నష్టపోతారు. అమెరికా నుంచి నాన్ వెజ్ మిల్క్ చౌకగా వస్తాయి. వాటి వల్ల మన దేశంలో పాడిపరిశ్రమపై ఆధారపడిన 8 కోట్ల మంది రైతుల జీవనోపాధి దెబ్బతింటుంది. ఒక నివేదిక ప్రకారం, ఈ దిగుమతుల వల్ల సంవత్సరానికి లక్ష కోట్ల రూపాయల నష్టం వస్తుంది. మనదేశంలో అనేక సహకార సంఘాలు పాడిపరిశ్రమపై ఆధారపడి ఉన్నాయి. నాన్ వెజ్ మిల్క్ వస్తే ఇవి కుంటుపడతాయి. అన్నిటికీ మించి నాన్ వెజ్ మిల్క్ తో చేసిన ఉత్పత్తులు మన హిందూ ఆచారాలకు, శాఖాహార సంప్రదాయానికి విరుద్ధం. దేవాలయాల్లో, పూజల్లో ఈ పాలను వాడలేం. ఏవి శాఖాహారపాలో, ఏవి మాంసాహార పాలో గుర్తించలేం. జంతు ఆహారం, జన్యుమార్పిడితో తయారు చేసిన దాణా వాడిన ఆవుల పాలు మన ఆరోగ్యానికి హాని చేస్తాయనే ఆందోళన ఉంది.
మన దేశం ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెట్లలో ఒకటి. అందుకే మనతో భారీ డీల్ కుదుర్చుకోవాలని ట్రంప్ భావిస్తున్నారు. అయితే నాన్ వెజ్ మిల్క్ విషయంలో ప్రతిష్టంభన నెలకొంది. భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం దాదాపు సిద్ధమైంది. అమెరికా ఉత్పత్తులపై 5 నుంచి 8శాతం సుంకాలు, భారత ఉత్పత్తులపై 10 నుంచి 12% సుంకాలకు ఇరు దేశాలు ఓకే చెప్పాయి. కానీ, నాన్ వెజ్ మిల్క్ విషయంలో మాత్రం భారత్ ససేమిరా అంటోంది. జంతు ఆహారం లేని ఆవు పాలను మాత్రమే పంపాలని స్పష్టం చేసింది. ప్రతి లీటర్ పాలకూ సర్టిఫికేట్ ఇవ్వాలని తేల్చి చెప్పింది. భారత్ పెట్టిన కండిషన్లపై అమెరికా, ప్రపంచ వాణిజ్య సంస్థ-WTOలో ఫిర్యాదు చేసింది. అయినా భారత్ తన సంస్కృతిని, రైతులను కాపాడుకోవడానికి గట్టిగా నిలబడింది.
నాన్ వెజ్ మిల్క్ అనేది కేవలం పాలకు సంబంధించిన విషయమే కాదు. ఇది మన సంస్కృతి, మన రైతుల జీవనోపాధి, మన ఆర్థిక వ్యవస్థలకు సంబంధించిన వ్యవహారం. భారత్ తన సంప్రదాయాన్ని కాపాడుకుంటూ అమెరికాతో బిజినెస్ డీల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.