IND vs SL ODI: భారత్, శ్రీలంక మధ్య 3 ODI మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌లో తొలి వన్డే ఆగస్టు 2న జరగనుంది. తాజాగా భారత్ తో వన్డే సిరీస్‌కు శ్రీలంక జట్టును ప్రకటించింది. ఈ సిరీస్‌లో శ్రీలంకకు చరిత్ అసలంక కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. అయితే ఈ జట్టులో ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్, ఫాస్ట్ బౌలర్ దాషున్ షనకకు చోటు దక్కకపోవడం విశేషం. ఇక భారత్ తో వన్డే సిరీస్ కు శ్రీలంక జట్టును చూస్తే ఇలా ఉంది.
Viral video: చైనాలో భారత ఇన్‌ఫ్లుయెన్సర్ వెకిలిచేష్టలు.. మండిపడుతున్న నెటిజన్లు
చరిత్ అసలంక (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, కుసాల్ మెండిస్, సదీర సమరవిక్రమ, కమిందు మెండిస్, జెనిత్ లియానాగే, నిషాన్ మదుష్క, వనిందు హసరంగా, దునిత్ వెల్లాగే, చమిక కరుణరత్నే, మహిష్ తీక్షణన్, అకిల ధనన్థితజయ్. డి లు టీం లో ఉన్నారు. ఇకపోతే., ఆగస్టు 2 నుంచి భారత్ శ్రీలంక మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఆగస్టు 4న ఇరు జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది. కాగా, సిరీస్ లో మూడో, చివరి వన్డే ఆగస్టు 7న జరగనుంది. ఈ సిరీస్ లోని 3 వన్డేలు కొలంబోలో జరగనున్నాయి. రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్ వంటి ఆటగాళ్లు వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాలో భాగం కానున్నారు.
Nirmala sitharaman: 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యం..
శ్రీలంకతో భారత జట్టు ప్రస్తుతం 3 టీ20 మ్యాచ్‌ల సిరీస్ ను ఆడుతున్న తెలిసిందే. ఇప్పటి వరకు శ్రీలంకతో జరిగిన తొలి రెండు టీ20 మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించింది. తొలి టీ20లో శ్రీలంక 43 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఆ తర్వాత జరిగిన రెండో టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో ఆతిథ్య శ్రీలంకను DLS పద్దతిలో ఓడించింది. ఇక ఇరు జట్ల మధ్య మూడో టీ20 జూలై 30న జరగనుంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు 2-0తో సిరీస్‌లో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను కైవసం చేసుకుంది .