Ind vs SA: ఆస్ట్రేలియాపై సిరీస్ విజయోత్సాహంతో టీ20 ప్రపంచకప్‌కు ముందు మరో టీ20 సిరీస్‌కు రోహిత్ సేన సిద్ధమైంది. ఆస్ట్రేలియాపై గెలిచిన రెండు రోజుల వ్యవధిలోనే సఫారీతో రెండో వేటకు సిద్ధమైంది. మేటి జట్టయిన దక్షిణాఫ్రికాతో మూడు టి20ల సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. బుధవారం జరిగే తొలి మ్యాచ్‌లో శుభారంభమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.
సఫారీలతో జరిగే ఈ టోర్నీ ప్రపంచకప్ తుది కసరత్తుకు ఆఖరి సమరంగా టీమ్ మేనేజ్‌మెంట్‌కు ఉపయోగపడుతుంది. ఆందోళన కలిగిస్తోన్న డెత్ ఓవర్ల బౌలింగ్‌ను మెరుగుపర్చుకుని ప్రపంచకప్ సన్నాహాన్ని సంతృప్తిగా ముగించాలన్నది జట్టు లక్ష్యం. బుమ్రా వచ్చాక కూడా ఆఖరి ఓవర్లలో ధారాళంగా పరుగులు సమర్పించుకోవడం బౌలింగ్ దళంపై కంగారు పెట్టిస్తోంది. ఈ సమస్యను అధిగమిస్తేనే కసరత్తు పూర్తి అవుతుంది. తమ కీలక బౌలర్లు హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్ లేకుండానే టీమ్‌ఇండియా సిరీస్‌కు సిద్ధమైంది. ప్రపంచకప్ నేపథ్యంలో వారికి విశ్రాంతినిచ్చారు. కరోనా నుంచి ఇంకా కోలుకోని ఫాస్ట్ బౌలర్ షమి ఈ సిరీస్‌కూ దూరమైన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా జట్టు కూడా బలంగా ఉన్న నేపథ్యంలో సిరీస్ హోరాహోరీగా సాగుతుందని భావిస్తున్నారు.
ఆసీస్‌తో సిరీస్‌లో బ్యాటర్లంతా రాణించడంతో మేనేజ్‌మెంట్‌కు ఈ అంశంలో పెద్దగా ఇబ్బందులు కనిపించడం లేదు. రోహిత్‌శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీతో.. బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా కనిపిస్తుండగా.. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ రూపంలో అద్భుత ఆటగాడుఅందుబాటులో ఉన్నాడు. హైదరాబాద్ వేదికగా జరిగిన చివరి టీ20లో విరాట్, సూర్య మెరుపులు మెరిపించిన విషయం తెలిసిందే. హార్దిక్ పాండ్యాకు విశ్రాంతినివ్వడంతో అతడి స్థానంలో పంత్ బరిలోకి దిగనున్నాడు. ఆ తర్వాత దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్ బ్యాటింగ్ చేయనున్నారు. దీపక్ చాహర్ కూడా బ్యాట్‌తో ఒక చేయి వేయగలవాడే కావడంతో భారత్ లైనప్ బలంగా కనిపిస్తోంది. ఈ సిరీస్ నుంచి హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్‌లకు విశ్రాంతి ఇచ్చారు. బౌలర్లే కీలకమైన దశలో డీలాపడటం, యథేచ్ఛగా పరుగులు కాదు వరుసబెట్టి బౌండరీలు, సిక్సర్లు ఇచ్చుకోవడం జట్టు భారీ స్కోర్లను కూడా సులువుగా కరిగిస్తున్నాయి.
Hero Vishal: బ్రేకింగ్.. హీరో విశాల్ ఇంటిపై రాళ్ల దాడి.. అద్దాలు ధ్వంసం
బవుమా నేతృత్వంలోని దక్షిణాఫ్రికా కూడా బలంగానే ఉంది. ఓపెనింగ్‌లో డికాక్, కెప్టెన్ బవుమాలతో పాటు మిడిలార్డర్‌లో హార్డ్ హిట్టర్లు మార్క్‌రమ్, మిల్లర్‌లతో బ్యాటింగ్ లైనప్ ఆతిథ్య జట్టులాగే పటిష్టంగా ఉంది. ఇందులో ఏ ఇద్దరు భారత్ బౌలింగ్‌పై మెరిపించినా కష్టాలు తప్పవు. ఇక సఫారీ బౌలింగ్ ఒకింత మనకంటే మెరుగనే చెప్పాలి. ప్రిటోరియస్, రబడ, నోర్జేలు అద్భుతంగా రాణిస్తున్నారు. టి20 సమరానికి సరైన సరంజామాతోనే దక్షిణాఫ్రికా భారత్‌కు వచ్చింది. ఆసీస్‌పై గెలిచిన ధీమాతో ఏమాత్రం ఆదమరిచినా టీమిండియాకు కోలుకోలేని దెబ్బ తప్పదు.
గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియం పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. ఇక్కడ జరిగిన ఓ టీ20లో రెండు ఇన్నింగ్స్‌ల్లో 170కిపైగా స్కోర్లు నమోదయ్యాయి. ఇక్కడ రెండు టీ20 మ్యాచ్‌లు జరిగాయి. 2017లో న్యూజిలాండ్‌తో ఎనిమిది ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో భారత్ గెలిచింది. 2019లో వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో భారత్ ఎనిమిది వికెట్లతో ఓడింది. బుధవారం వర్షంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగే అవకాశముంది.