Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports India Vs Pakistan U 19 Asia Cup India Crushes Pakistan By 90 Runs In Group Match

IND vs PAK U-19: సీనియర్లే కాదు జూనియర్స్ కూడా.. భారత్ చేతిలో పాకిస్థాన్ చిత్తు..!

Published Date :December 14, 2025 , 6:26 pm
By Kothuru Ram Kumar
  • అండర్-19 ఆసియా కప్‌లో భారత్ ఘన విజయం
  • దుబాయ్ వేదికగా జరిగిన గ్రూప్–A మ్యాచ్
  • 90 పరుగుల తేడాతో పాకిస్థాన్‌పై భారత్ విజయం.
IND vs PAK U-19: సీనియర్లే కాదు జూనియర్స్ కూడా.. భారత్ చేతిలో పాకిస్థాన్ చిత్తు..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

IND vs PAK U-19: అండర్-19 ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ మరోసారి అభిమానులకు మజాను పంచింది. దుబాయ్ వేదికగా జరిగిన గ్రూప్–A మ్యాచ్‌లో భారత్ అండర్-19 జట్టు 90 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ ఆధిపత్యం ప్రదర్శించిన భారత జట్టు భారీ విజయాన్ని నమోదు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 49 ఓవర్లలో 46.1 ఓవర్లకు 240 పరుగులు చేసింది. కెప్టెన్ ఆయుష్ మహత్రే 25 బంతుల్లో 38 పరుగులు చేశాడు. అతడితోపాటు ఆరన్ జార్జ్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అతడు 88 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్స్ తో 85 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. ఇక మధ్యలో కనిష్క్ చౌహాన్ 46 బంతుల్లో 46 పరుగులు చేసి స్కోరు వేగాన్ని పెంచాడు. వీరితోపాటు అబిగ్యాన్ కుండు (22), హెనిల్ పటేల్ (12) చివర్లో పరుగులు చేసి మంచి స్కోర్ సాధించింది. పాకిస్థాన్ బౌలర్లలో మొహమ్మద్ సయ్యం, అబ్దుల్ సుభాన్ చెరో మూడు వికెట్లు తీసినా.. భారత్ 240 పరుగుల స్కోరు సాధించింది.

Pamidi: దారుణం.. పోలీసుపై కత్తితో దాడి చేసిన మతిస్థిమితం లేని యువకుడు..!

ఇక 241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ అండర్-19 జట్టు 41.2 ఓవర్లలో 150 పరుగులకే ఆలౌట్ అయింది. ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోయిన పాక్ జట్టు ఒత్తిడిలో పడింది. హుజైఫా అహ్సన్ 83 బంతుల్లో 70 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేసినా.. మిగతా బ్యాటర్లు పెద్దగా సహకరించలేకపోయారు. భారత బౌలింగ్‌లో దీపేష్ దేవేంద్రన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతడు 7 ఓవర్లలో కేవలం 16 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అలాగే కనిష్క్ చౌహాన్ కూడా 10 ఓవర్లలో 33 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. కిషన్ సింగ్ రెండు వికెట్లతో విజయానికి తోడ్పడ్డాడు. ఇక ఈ మ్యాచ్ లో కూడా కురాళ్లు మరోసారి నో షేక్‌హ్యాండ్స్ పద్దతిని కొనసాగించారు.

AMOLED డిస్‌ప్లే, 7,400mAh భారీ బ్యాటరీతో డిసెంబర్ 17న భారత్‌లో OnePlus 15R లాంచ్.. ధరల వివరాలు లీక్..!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • asia cup
  • cricket news
  • IND vs PAK U-19
  • IND vs PAK U19 result
  • India U19

తాజావార్తలు

  • Father Kills Daughters: తండ్రి కాదు రాక్షసుడు.. కవల పిల్లలను హత్య చేసి స్వయంగా పోలీసులకు ఫోన్..

  • Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు

  • Ali Khamenei: ఇరాన్‌లో భయం ఇంకా తగ్గలేదు… ఖమేనీ అంత్యక్రియలు నెలరోజులుగా వాయిదా!

  • Travis Head: SRH ఫ్యాన్స్‌కు షాక్.. ట్రావిస్ హెడ్ బ్యాటింగ్‌లో ఇంత మార్పా..? గణాంకాలు ఏం చెబుతున్నాయి?

  • Kadiyam Srihari : తెలంగాణ ఏర్పాటును అడుగడుగునా బీజేపీ అవమానిస్తోంది

ట్రెండింగ్‌

  • Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!

  • Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!

  • Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!

  • Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?

  • Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions