END vs ENG: రవీంద్ర జడేజా ఓ జట్టులో.. కుల్దీప్ యాదవ్ మరో జట్టులో!
- సుదీర్ఘ విరామం తర్వాత టెస్ట్ క్రికెట్ ఆడేందుకు సిద్దమైన టీమిండియా
- లీడ్స్ వేదికగా జూన్ 20 నుంచి తొలి టెస్ట్ ప్రారంభం
- ఇంగ్లండ్‌లో ముమ్మరంగా సాధన చేస్తోన్న టీమిండియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా టెస్ట్ క్రికెట్ ఆడేందుకు సిద్దమైంది. ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ మరో వారం రోజుల్లో ఆరంభం కానుంది. లీడ్స్ వేదికగా జూన్ 20 నుంచి ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. టీమిండియా సీనియర్ ప్లేయర్స్ ఆర్ అశ్విన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఇంగ్లండ్ సిరీస్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సారథ్యంలో భారత్ ఎలా ఆడబోతుందో అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే ఇంగ్లండ్ చేరిన భారత జట్టు ముమ్మరంగా సాధన చేస్తోంది. ఇంగ్లండ్ లయన్స్‌తో అనధికారిక టెస్ట్‌లు ఆడిన టీమిండియా.. నేటి నుంచి నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడబోతోంది. ఈ వార్మప్ మ్యాచ్‌లో భారత్ ఆటగాళ్లు రెండు జట్లుగా విడిపోయి ఆడనున్నారు. రోజుకు 90 ఓవర్స్ పడుతాయి. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ ఒక జట్టులో.. రవీంద్ర జడేజా మరో జట్టులో ఆడబోతున్నారు. విదేశాల్లో జట్టులోకి కొత్త బ్యాటర్స్ కోసం ఇద్దరిని వేర్వేరు జట్లలో ఆడిస్తున్నారు. దాంతో బ్యాటర్లకు సరైన ప్రాక్టీస్ దొరుకుతుందని మేనేజ్మెంట్ భావిస్తోంది.
Also Read
- Tilak Varma: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. 136 పరుగులు సాధించి ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించిన వర్మ..
- Qatar LNG Plant Explosion: 12 మంది భారతీయులు సహా 13 మంది మృతి.. అత్యవసర హెల్ప్‌లైన్ ఏర్పాటు
- Off The Record: బాల్కొండలో పొలిటికల్ ఫైట్.. ప్రశాంత్ రెడ్డికి చెక్ ఎవరు పెడతారు?
- Off The Record: ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్ స్టార్ట్?
Also Read: Wimbledon 2025: భారీగా వింబుల్డన్ ప్రైజ్‌మనీ.. విజేతకు ఎన్ని కోట్లంటే?
పేసర్లు ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణలను ఈ వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా మేనేజ్మెంట్ పరీక్షించనుంది. ఇక ఆరు నెలల తర్వాత టెస్ట్ క్రికెట్ ఆడనున్న పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్, ఫామ్‌కు ఈ మ్యాచ్ పెద్ద పరీక్ష. వెన్ను నొప్పి నుంచి కోలుకుని ఐపీఎల్ ఆడిన బుమ్రాతో ఎక్కువ స్పెల్స్ బౌలింగ్ చేయించాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. ఐపీఎల్ 2025లో మహమ్మద్ సిరాజ్ రాణించడంతో భారీ అంచనాలు ఉన్నాయి. కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్, కరుణ్ నాయర్, అభిమన్యు ఈశ్వరన్, ధ్రువ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డిలు బ్యాటర్లుగా ఆడనున్నారు. ఈ వార్మప్ మ్యాచ్‌లో బ్యాటర్ త్వరగా ఔటైతే.. అతడికి మరో అవకాశం ఇస్తారు.
తాజావార్తలు
-
Tilak Varma: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. 136 పరుగులు సాధించి ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించిన వర్మ..
-
Qatar LNG Plant Explosion: 12 మంది భారతీయులు సహా 13 మంది మృతి.. అత్యవసర హెల్ప్‌లైన్ ఏర్పాటు
-
Off The Record: బాల్కొండలో పొలిటికల్ ఫైట్.. ప్రశాంత్ రెడ్డికి చెక్ ఎవరు పెడతారు?
-
Off The Record: ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్ స్టార్ట్?
-
T20 World Cup: ప్రపంచకప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. ‘వెళ్లి షాపింగ్, హోటల్లో డిన్నర్లు చేసుకోండి’..
ట్రెండింగ్
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్‌బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!