సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా టెస్ట్ క్రికెట్ ఆడేందుకు సిద్దమైంది. ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ మరో వారం రోజుల్లో ఆరంభం కానుంది. లీడ్స్ వేదికగా జూన్ 20 నుంచి ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. టీమిండియా సీనియర్ ప్లేయర్స్ ఆర్ అశ్విన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఇంగ్లండ్ సిరీస్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సారథ్యంలో భారత్…