NTV Telugu Site icon

India vs Bangladesh: రెండోరోజు ఆట వర్షర్పణం కానుందా.? కమ్ముకున్న చీకటి మేఘాలు!

India Vs Bangladesh

India Vs Bangladesh

India vs Bangladesh: భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య కాన్పూర్ వేదికగా రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో చివరి మ్యాచ్ జరుగుతోంది. ఇందులో భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఇందులో భాగంగా కాన్పూర్ టెస్టు తొలిరోజు వర్షం కారణంగా ఆటంకం ఏర్పడింది. వర్షం కారణంగా తొలిరోజు ఆట కేవలం 35 ఓవర్లు మాత్రమే ఆడగలిగింది. భారత బౌలర్లు 3 వికెట్లు తీశారు. కాగా, బంగ్లాదేశ్ జట్టు 3 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. బంగ్లాదేశ్‌కు తమ ఇన్నింగ్స్‌ను భారీ స్కోరుకు తీసుకెళ్లాలంటే భారీ భాగస్వామ్యం ఇప్పుడు అవసరం. ప్రస్తుతం క్రీజులో మోమినుల్ హక్ 40 పరుగులతో, రహీమ్ 6 పరుగులతో ఉన్నారు. ఇక టీం ఇండియా బౌలర్లులో ఆకాష్ దీప్ 2 వికెట్లు తీసుకోగా, అశ్విన్ ఒక వికెట్ తీసుకున్నాడు.

England vs Australia: ఇంగ్లాండ్ దెబ్బకి చిన్నబోయిన ఆస్ట్రేలియా.. భారీ విజయాన్ని అందుకున్న ఇంగ్లాండ్!

కాన్పూర్ టెస్టు రెండో రోజు 80 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది. సెప్టెంబరు 27 శుక్రవారం కురిసిన వర్షం కారణంగా రెండో రోజు ఆట ఆలస్యం అయ్యింది. ఇకపోతే ఉదయం నుంచి కాన్పూర్‌లో చీకటి మేఘాలు కమ్ముకున్నాయి. ఇక ఆదివారం యూదా వర్షం పడే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయి అని వాతావరణ శాఖ తెలిపింది. ఇక సోమ, మంగళవారాలలో ఆట పూర్తిగా జరిగే అవకాశం ఉంది.