India vs Bangladesh: భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య కాన్పూర్ వేదికగా రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో చివరి మ్యాచ్ జరుగుతోంది. ఇందులో భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఇందులో భాగంగా కాన్పూర్ టెస్టు తొలిరోజు వర్షం కారణంగా ఆటంకం ఏర్పడింది. వర్షం కారణంగా తొలిరోజు ఆట కేవలం 35 ఓవర్లు మాత్రమే ఆడగలిగింది. భారత బౌలర్లు 3 వికెట్లు తీశారు. కాగా, బంగ్లాదేశ్ జట్టు 3 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. బంగ్లాదేశ్‌కు…