Site icon NTV Telugu

Plane Crash: విమాన ప్రమాద దర్యాప్తులో అమెరికా ఎందుకు పాల్గొంటోంది?

Air India

Air India

అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం గురువారం కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ విమాన ప్రమాదం చాలా దారుణంగా మారింది. 241 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఒకే ఒక ప్రయాణీకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాదం ఎలా జరిగింది? టేకాఫ్ అయిన ఐదు నిమిషాలకే విమానం ఎలా కూలిపోయింది? దీనికి కారణం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది.

READ MORE: Plane Crash: ప్రమాద స్థలంలో బ్లాక్ బాక్స్ లభ్యం..

అయితే.. ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టేందుకు భారత్ నుంచి లండన్‌కు వచ్చిన బృందాలు ఈ విమాన ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించాయి. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దర్యాప్తులో ఒక అమెరికన్ ఏజెన్సీ కూడా పాల్గొంటుంది. బోయింగ్ విమానానికి సంబంధించిన సాంకేతిక అంశాలలో ఈ ఏజెన్సీ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. విమాన ప్రమాదంపై దర్యాప్తును భారతదేశ ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) నిర్వహిస్తోంది. ఈ దర్యాప్తులో సహాయం చేయడానికి.. యూకేకి చెందిన ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ (AAIB), యూఎస్ నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) కూడా దర్యాప్తులో పాల్గొంటున్నాయి.

READ MORE: Wife Affair: పెళ్లైన 13 ఏళ్లకు బయటపడ్డ భార్య ప్రేమ వ్యవహారం.. పెళ్లి చేసిన భర్త

అసలు మనదేశంలో జరిగిన ప్రమాదంపై ఆ దేశాల ఎజెన్సీలు ఎందకు దర్యాప్తు చేస్తున్నయని కొందరు అనుకుంటున్నారు. అయితే.. ఆ విమానంలో బ్రిటిష్ పౌరులు కూడా ఉన్నారు కాబట్టి బ్రిటిష్ ఏఏఐబీ ఈ దర్యాప్తులో పాల్గొంటోంది. మరోవైపు.. అమెరికాలో తయారైన బోయింగ్ విమానంలో ఈ ప్రమాదం జరిగినందున అమెరికా ఈ దర్యాప్తులో పాల్గొంటోంది. దీని కారణంగా, బోయింగ్ విమానానికి సంబంధించిన సాంకేతిక అంశాలను దర్యాప్తు చేయడంలో అమెరికా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. తాజాగా బ్లాక్ బాక్స్ కూడా లభించడంతో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.

READ MORE: Air India Plane Crash: ‘‘ఫ్యూయల్ ఫిల్టర్ జామ్’’..ఎయిరిండియా ప్రమాదానికి ప్రాథమిక కారణం.!

Exit mobile version