Air India Crash: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంపై ప్రాథమిక దర్యాప్తు నివేదిక జూలై 11 నాటికి విడుదల కానుంది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 242 మందిలో ఒక్కరు మినహా అంతా మరణించారు. నేలపై ఉన్న మరో 34 మంది చనిపోయారు. వచ్చే వారం విడుదల కాబోయే ప్రాథమిక రిపోర్టు కీలకంగా మారబోతోంది. 4-5 పేజీల నిడివి ఉంటుందని భావిస్తున్న ఈ డాక్యుమెంట్‌లో ప్రమాదానికి సాధ్యమయ్యే కారణాలతో సహా అనేక కీలక విషయాలు ఉండనున్నాయి.
అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం గురువారం కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ విమాన ప్రమాదం చాలా దారుణంగా మారింది. 241 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఒకే ఒక ప్రయాణీకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాదం ఎలా జరిగింది? టేకాఫ్ అయిన ఐదు నిమిషాలకే విమానం ఎలా కూలిపోయింది? దీనికి కారణం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది.