India Lok Sabha Seats Increase: లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంపు.. 2029 ఎన్నికల నుంచే అమలు, తెలంగాణలో ఎన్ని పెరుగుతాయంటే?
- కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
- లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంపు
- 2029 ఎన్నికల నుంచే అమలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India to Increase Lok Sabha and Assembly Seats by 50 Percent: దేశ రాజకీయాల్లో కీలక మార్పులకు దారి తీసే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ స్థానాలను 50 శాతం పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన బిల్లును ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టడానికి సిద్ధమైనట్లు తెలిసింది. దీని ప్రకారం.. ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాలు 816కి పెరగనున్నాయి. ఇదే విధంగా దేశవ్యాప్తంగా అసెంబ్లీ స్థానాలు కూడా 4,123 నుంచి 6,185కు పెరుగుతాయి.
ఈ ప్రతిపాదనలో భాగంగా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు గణనీయంగా పెరగనున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 17 లోక్‌సభ స్థానాలు 26కు.. అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 179కి పెరగనున్నాయి. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ స్థానాలు 25 నుంచి 38కి.. అసెంబ్లీ స్థానాలు 175 నుంచి 263కు చేరే అవకాశం ఉంటుంది.
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్‌కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
ఇందుకు సంబంధించిన సమాచారాన్ని సోమవారం సాయంత్రం ఎన్డీయే సమావేశంలో కేంద్ర ప్రభుత్వం వామపక్ష పార్టీలకు వెల్లడించినట్లు తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్‌ల నేతృత్వంలో భేటీ జరిగింది. కాంగ్రెసేతర విపక్షాలతోనూ విడిగా భేటీ జరిగింది. కాంగ్రెస్ పార్టీతోనూ అమిత్ షా మాట్లాడే అవకాశం ఉంది.
Also Read: Today Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ఆర్థిక నష్టం తప్పదు!
ఈ ప్రతిపాదనను అమలు చేయడానికి అవసరమైన బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో ఈ బిల్లును ఆమోదింపజేయాలని కేంద్రం భావిస్తోంది. 2029 సాధారణ ఎన్నికల నుంచే ఈ కొత్త వ్యవస్థ అమలులోకి వచ్చే అవకాశం ఉంది. జనాభా ఆధారంగా ప్రతినిధిత్వాన్ని పెంచడం, ప్రజల సమస్యలను మరింత సమర్థవంతంగా ప్రతిబింబించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Kalyani Priyadarshan: రణవీర్ సింగ్ ‘ప్రళయ్’లో కళ్యాణి ప్రియదర్శన్? బాలీవుడ్లో మరో పెద్ద అవకాశం దక్కనున్నదా!
-
Samsung Galaxy Z Flip 8: 4300mAh బ్యాటరీ, 50MP కెమెరాతో సామ్ సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 8 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!