India T20 World Cup 2026 Squad: 2026 టీ20 వరల్డ్ కప్ మరికొన్ని వారాల్లో ప్రారంభం కానుంది. 20 జట్లతో జరిగే ఈ టోర్నీ ఫిబ్రవరి 7 నుంచి మొదలవుతుంది. భారత్ తన టైటిల్‌ను నిలబెట్టుకుంటుందా అనే అంశంపై అందరి దృష్టి ఉంది. అందుకు తొలి అడుగు డిసెంబర్ 20, శనివారం పడనుంది. ఆ రోజు జాతీయ సెలక్టర్ల ఛైర్మన్ అజిత్ అగార్కర్ 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించనున్నారు. ముంబైలో అగార్కర్‌తో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కలిసి ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు.
READ MORE: Astrology: డిసెంబర్ 20, శనివారం దినఫలాలు..
అయితే జట్టులో పెద్ద మార్పులు జరిగే అవకాశం తక్కువగానే కనిపిస్తోంది. ఇటీవల ముగిసిన దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ఎంపికైన అదే 15 మంది ఆటగాళ్లే వరల్డ్ కప్ జట్టులో కూడా ఉండే అవకాశముంది. అయితే శుభ్‌మన్ గిల్ తాజా ఫామ్‌పై మాత్రం చర్చలు తప్పక వినిపిస్తున్నాయి. అభిషేక్ శర్మతో కలిసి గిల్ ఓపెనర్‌గా ఆడటం వరల్డ్ కప్‌కు సరైన వ్యూహమేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వైస్ కెప్టెన్‌గా మళ్లీ టీ20 జట్టులోకి వచ్చిన తర్వాత గిల్ ఒక్క అర్ధశతకం కూడా చేయలేకపోయాడు. ప్రస్తుతం టెస్ట్, వన్డే కెప్టెన్‌గా ఉన్న 26 ఏళ్ల గిల్, కాలికి గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో చివరి మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఆ మ్యాచ్‌లో సంజూ శాంసన్ ఓపెనర్‌గా వచ్చి 37 పరుగులతో వేగంగా ఆడి ఆకట్టుకున్నాడు. దీంతో అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్‌కు శాంసన్ సరైన ఎంపిక అన్న అభిప్రాయం బలపడుతోంది. కాగా.. భారత టీ20 వరల్డ్ కప్ జట్టు ప్రకటన డిసెంబర్ 20, శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు జరుగుతుంది. ఈ ప్రకటన ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయం నుంచి జరుగుతుంది. సెలక్టర్ల చైర్మన్ అజిత్ అగార్కర్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. అలాగే జియో హాట్‌స్టార్ యాప్, వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది.
READ MORE: Hardik Pandya: హార్దిక్ పాండ్యా రొమాంటిక్ స్టైల్.. తన ప్రేయసికి ఫ్లయింగ్ కిస్..(వీడియో)