భర్త పెట్రోల్ పోయించుకునేందుకు బంక్ దగ్గరికి వెళ్లాడు. ఆ సమయంలోనే బైక్ దిగిన తన భార్య కాస్త ముందుకెళ్లి నిల్చుంది. పెట్రోల్ పోయించుకుని తన భార్యలాంటి చీరే కట్టుకున్న మరో మహిళను అతడు ఏయ్ ఎక్కు బండి అన్నాడు. ఆవిడ కూడా తన భర్తే అనుకుని ఎక్కేసింది. కాసేపటికి తెలిసింది ఆవిడ తన భార్య కాదని. ‘ఏవండీ.. మన ఇల్లు ఇటుకాదు కదా.. ఇటు వైపు ఎందుకు తీసుకువెళుతున్నారు?’ అని ఆ మహా ఇల్లాలు తన భర్తను ప్రశ్నించింది. ఏంటీ భార్య అలా మాట్లాడుతోందని వెనక్కు తిరిగి చూస్తే- తన ద్విచక్ర వాహనంపై కూర్చున్నావిడ తన భార్య కాదని తెలుసుకుని, నాలుక కరచుకున్నాడాయన.
Also Read: Ravindra Jadeja: జడేజా రాసుకుంది ఆయింట్‌మెంట్..రిఫరీకి చెప్పిన టీమిండియా!
అసలేం జరిగిందంటే..
భార్యతో కలిసి పెట్రోలు పోయించుకునేందుకు వెళ్లిన వ్యక్తికి- అక్కడే నిలబడి ఉన్న మహిళను బండి ఎక్కమన్నాడు. పిలిచింది తన భర్తే అని ఆమె అనుకుంది. తన భార్య ధరించిన రంగు చీరే కట్టుకుని ఉండడంతో బైకు ఎక్కినావిడి తన భార్యే అని ఈయన అనుకున్నాడు. భర్త లాంటి బైకు.. అదే సౌష్ఠవం.. తెల్ల చొక్కా.. ఒకే రంగు శిరస్త్రాణం ఉండడంతో ఈమె కూడా పొరపాటు పడింది. జరిగిన పొరపాటు అర్థమైన ఐదు నిమిషాలలోనే ఆయన తిరిగి ఆమెను పెట్రోలు బంకు దగ్గరకు తీసుకు వచ్చాడు. అప్పటికే ఈయన భార్య, ఆమె భర్త అక్కడ వేచి చూస్తూ ఉన్నారు. నలుగురూ మొహం కప్పి ఉంచే శిరస్త్రాణాలు ధరించి ఉండడంతో ఈ పొరపాటు జరిగిందని తెలుసుకుని వారితో పాటు, బంకులో ఉన్న వారూ ఆ విషయం తెలుసుకుని కడుపుబ్బా నవ్వుకున్నారు. కర్ణాటకలోని హావేరి జిల్లా రాణేబెన్నూరులో బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది.
Also Read: Shehzada: ఓ మై గాడ్ డాడీ ప్లేస్ లో… క్యారెక్టర్ డీలా హై…