NTV Telugu Site icon

IND vs BAN: బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు భారత జట్టు ప్రకటన..

Ind Vs Ban

Ind Vs Ban

IND vs BAN: బంగ్లాదేశ్‌తో చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో 280 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకున్న టీమిండియా.. కాన్పూర్ వేదికగా జరగనున్న రెండో టెస్టుకు భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్‌ లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో భారత్ – బంగ్లాదేశ్ మధ్య రెండో, చివరి టెస్టు జరగనుంది. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత జట్టు 1-0 ఆధిక్యంలో ఉంది. రెండు జట్ల మధ్య జరిగే ఈ సిరీస్ ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 ​​(ICC WTC 2025 అప్డేటెడ్ పాయింట్స్ టేబుల్)లో భాగం.

Ravichandran Ashwin: దిగ్గజాల రికార్డులు బ్రేక్స్ చేసిన అశ్విన్‌!

రెండో టెస్టుకు భారత జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. చెన్నైలో జరిగిన తొలి టెస్టులో భారత జట్టులో భాగమైన మొత్తం 16 మంది ఆటగాళ్లను జట్టులో ఉంచారు. అంటే రెండో టెస్ట్ కు ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత జట్టు ఇప్పటికే పాయింట్ల పట్టికలో నంబర్-1 స్థానంలో ఉంది. ఇక బంగ్లాదేశ్‌ను ఓడించిన తర్వాత ఆ జట్టు తన ఆధిక్యాన్ని మరింత పటిష్టం చేసుకుంది. తొలి టెస్టుకు ముందు భారత జట్టు 68.52 శాతం విజయంతో నంబర్‌వన్‌లో ఉంది. విజయం తర్వాత టీమిండియా విజయ శాతం ఇప్పుడు 71.67 కి పెరిగింది. WTC మూడో సైకిల్‌లో 10 మ్యాచ్‌ల్లో భారత్‌కు ఇది ఏడో విజయం. రెండు పరాజయాలను చవిచూడగా, ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది.

Period Pain: మహిళలు పీరియడ్ పెయిన్‌తో ఇబ్బందులా.? అయితే ఇలా ఉపశమనం పొందండి..

రెండో టెస్టుకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్ రిషబ్ పంత్ (WK), ధృవ్ జురెల్ (WK), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ , జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్, యష్ దయాల్.