NTV Telugu Site icon

INDIA: భారత్‌లో మైనారిటీలపై ద్వేషం పెరుగుతోందని అమెరికా మత స్వేచ్ఛ నివేదిక వెల్లడి.. తిరస్కరించిన భారత్

New Project (16)

New Project (16)

అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన మత స్వేచ్ఛ నివేదికను భారత్ నేరుగా తిరస్కరించింది. మత స్వేచ్ఛపై అమెరికా విదేశాంగ శాఖ నివేదికను తిరస్కరిస్తున్నామని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ఈ నివేదికలో చాలా పక్షపాతం ఉందని.. భారతదేశ సామాజిక నిర్మాణంపై అవగాహన లేకుండా అమెరికా ప్రత్యేక కథనాన్ని రూపొందించిందని మండిపడ్డారు. భారతీయ న్యాయస్థానాలు ఇచ్చిన కొన్ని చట్టపరమైన తీర్పుల సమగ్రతను కూడా ఈ నివేదిక సవాలు చేసేలా కనిపిస్తోందని ఆయన అన్నారు. కాగా.. భారత్‌లో మైనారిటీలపై ద్వేషం పెరుగుతోందని అమెరికా బుధవారం రిలిజియస్ ఫ్రీడం రిపోర్టును విడుదల చేసిన సంగతి తెలిసిందే. భారతదేశంలో మైనారిటీ వర్గాలపై హింసాత్మక దాడులు జరుగుతున్నాయని నివేదిక పేర్కొంది. ఇది మే 2023లో మణిపూర్‌లో ప్రారంభమైన హింసను కూడా సూచిస్తుంది.

READ MORE: Darshan Khaidi No 6106: ఇదేం పిచ్చిరా మీకు.. చంపి జైలుకెళ్తే స్టిక్కర్లు వేయిస్తారా?

విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. ” నివేదిక తీవ్ర పక్షపాతంతో కూడుకున్నది, భారతదేశ సామాజిక నిర్మాణంపై అవగాహన లేదు…కాబట్టి మేము దానిని తిరస్కరిస్తున్నాము. ఈ నివేదికలో ఆరోపణలు, తప్పుగా సూచించడం, వాస్తవాలను ఎంపిక చేసుకోకపోవడం, పక్షపాత మూలాలపై ఆధారపడటం స్పష్టం కనిపిస్తోంది. ఇది ఏకపక్ష అంచనాల మిశ్రమం.” అని వ్యాఖ్యానించారు.