Darshan Khaidi No 6106 Stickers: శాండల్‌వుడ్ స్టార్ హీరో దర్శన్ రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడిగా జైలులో ఉన్న సంగతి తెలిసిందే. జ్యూడిషల్ కస్టడీలో భాగంగా ఇప్పుడు పరప్పన అగ్రహార జైల్లో ఉన్నాడు దర్శన్. ఆయనకు ఖైదీ నంబర్ 6106 కేటాయించారు. అయితే ఈ విషయం వెలుగు లోకి వచ్చాక ఇప్పుడు 6106 స్టిక్కర్‌కు ఫుల్ డిమాండ్ ఏర్పడి మొబైల్ షాపుల ముందు ఆయన అభిమానులు బారులు తీరుతున్నారు. మొబైళ్ల కవర్లకు ఆ స్టిక్కర్లు వేయించుకుంటున్న అభిమానులు తమ అభిమాన ‘డి బాస్’పై తమ ప్రేమను చూపిస్తున్నారు. నటుడు దర్శన్ జైలు ఖైదీ నంబర్ 6106ని ఇప్పుడు బైక్‌లు, ఆటోలు, కార్ల వెనుక కూడా స్టిక్కరింగ్ చేయిస్తున్నారు. ఖైదీ నంబర్ 6106 సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
Darshan: దర్శన్ కు మద్దతు పలికిన నటికి అభిమానుల టార్చర్.. చెప్పుకోలేనంత అసభ్యంగా!
ఖైదీ నంబర్ 6106 స్టిక్కర్లకు ఫుల్ గిరాకీ ఉండడంతో మొబైల్ షాపుల యజమానులు బిజీబిజీగా ఉన్నారు. బెంగళూరుతో సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై వందలాది మంది అభిమానులు తమ వాహనాలపై అలాంటి స్టిక్కర్లతో కనిపిస్తున్నారు. మరోపక్క నటుడు దర్శన్ పరప్పన అగ్రహార జైలు నుంచి జైలు అధికారుల ద్వారా అభిమానులకు చేసిన విజ్ఞప్తి కూడా సర్వత్రా వైరల్ అవుతోంది. శాండల్‌వుడ్ నటుడు దర్శన్ ఇప్పుడు జైలు నుండి తన అసంఖ్యాక అభిమానులకు లేఖ రాశారు. నటుడు దర్శన్ ఓ లేఖ ద్వారా అభిమానులు ఎవరూ జైలు దగ్గరకు రాకూడదుని కోరారు జైలు నిబంధనల ప్రకారం అభిమానుల సందర్శన అసాధ్యం, మీరు నన్ను చూడటానికి జైలు దగ్గరకు వచ్చి వేచి ఉండాలి, నన్ను సందర్శించే అవకాశం మీకు లభించదు, అప్పుడు నిరాశతో తిరిగి వెళ్లాల్సి ఉంటుందని అన్నారు.