Site icon NTV Telugu

Covid-19: దేశంలో కరోనా విజృంభణ.. ఒక్కరోజే 12 వేలు దాటిన కేసులు

Corona

Corona

Covid-19: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. భారతదేశంలో గత 24 గంటల్లో 12,591 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు నిన్నటితో పోలిస్తే 20 శాతం ఎక్కువగా నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా యాక్టివ్‌ కేసుల సంఖ్య 62,286కి చేరింది. ఒమిక్రాన్ సబ్-వేరియంట్ XBB.1.16 కేసుల పెరుగుదలకు దారితీస్తుందని వైద్య నిపుణులు తెలిపారు. అయినప్పటికీ ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, ప్రజలు కొవిడ్ ప్రోటోకాల్‌ను పాటించాలని, బూస్టర్‌ డోస్‌లను పొందాలని తెలిపారు.

Read Also: Modi Surname Remark: రాహుల్ గాంధీ పిటిషన్‌పై సూరత్ కోర్టు నేడు తీర్పు

బుధవారం 10,542 కేసులు నమోదు కాగా.. గురవారం 20 శాతం అధికంగా అంటే.. 2వేల కేసులు ఎక్కువగా నమోదు అయ్యాయి. ఈ వారం ప్రారంభంలో కేసులు స్వల్పంగా తగ్గాయి. మంగళవారం 7,633 కొత్త ఇన్‌ఫెక్షన్లు నమోదు కాగా.. సోమవారం 9,111 నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం నమోదైన కొవిడ్ కేసుల సంఖ్య 4.48 కోట్లు (44,857,992)గా ఉంది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 44,261,476గా ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. కరోనా కారణంగా 24 గంటల్లో దేశవ్యాప్తంగా 30 మంది ప్రాణాలు కోల్పోయారు. చత్తీస్‌గఢ్‌లో నలుగురు, ఢిల్లీలో ఐదుగురు, హిమాచల్ ప్రదేశ్‌లో ఇద్దరు, కేరళలో ఇద్దరు, కర్ణాటకలో ముగ్గురు, పుదుచ్చేరి, తమిళనాడు, ఉత్తరాఖండ్, పంజాబ్‌లలో ఒక్కొక్కరు, మహారాష్ట్రలో ఆరుగురు, రాజస్థాన్‌లో ఇద్దరు మరణించారు.

Exit mobile version