India Post GDS Result 2026: గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు.. ఎంపికైన అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్.. ఇలా చెక్ చేసుకోండి
- గ్రామీణ డాక్ సేవక్ ఎంపికైన అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్
- అధికారిక వెబ్‌సైట్ indiapostgdsonline.gov.in లో మొదటి మెరిట్ జాబితా
- 23/03/2026న డాక్యుమెంట్ వెరిఫికేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియా పోస్ట్ గ్రామీణ డాక్ సేవక్ (GDS) నియామకాలకు షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసింది. 28,636 GDS పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ indiapostgdsonline.gov.in లో మొదటి మెరిట్ జాబితాను చెక్ చేసుకోవచ్చు. సర్కిల్ వారీగా PDF మెరిట్ జాబితాను అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. నియామక ప్రక్రియలో రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఉండవు. ఎంపిక పూర్తిగా 10వ తరగతి మార్కుల ఆధారంగా ఉంటుంది. కంప్యూటర్ ద్వారా జనరేటెడ్ మెరిట్ జాబితాను తయారు చేస్తారు. దీనిలో గ్రేడ్‌లు లేదా పాయింట్లను శాతాలుగా మారుస్తారు.
Also Read:Megastar Chiranjeevi: మెగాస్టార్ ఖాతాలో మరో అవార్డ్.. అగ్ర నటుడికి అత్యున్నత గౌరవం
Also Read
ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి నాలుగు దశాంశ స్థానాల వరకు కాలిక్యులేషన్స్ నిర్వహిస్తారు. సెకండరీ స్కూల్ పరీక్షలో ఎక్కువ స్కోర్లు సాధించిన అభ్యర్థులు మెరిట్ లిస్ట్ లో సెలెక్ట్ కావడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు 23/03/2026న లేదా అంతకు ముందు వారు ఎంపిక అయిన డివిజన్‌లోని డివిజనల్ కార్యాలయంలో వారి పత్రాలను ధృవీకరించుకోవాలి. అభ్యర్థులు అన్ని సంబంధిత పత్రాల ఒరిజినల్స్, 2 సెట్ల ఫోటోకాపీలతో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కు హాజరు కావాల్సి ఉంటుంది. ఇండియా పోస్ట్ GDS రిజల్ట్స్ 2026 మొదటి మెరిట్ జాబితాను తనిఖీ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
తాజావార్తలు
-
Ramnagar Stampede: రాంనగర్ గణేష్ ఆగమన్ ర్యాలీలో విషాదం.. తొక్కిసలాటలో యువకుడు మృతి
-
KCR: నేడు బీఆర్ఎస్ఎల్పీ సమావేశం.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Subhash Chandra: సుభాష్ చంద్రా చుట్టూ సీబీఐ ఉచ్చు.. రూ.1,322 కోట్ల లోన్ కేసులో ఎఫ్ఐఆర్
-
Suriya : ఆ బ్లాక్‌బస్టర్ సినిమాకు సీక్వెల్‌గా సూర్య 50?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!