IND vs NZ: చెలరేగిన కోహ్లీ, శ్రేయస్.. న్యూజిలాండ్ లక్ష్యం@398
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs NZ: టీమిండియా స్టార్ బ్యాటర్లు చెలరేగి ఆడడంతో భారత్ భారీ స్కోరును సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 397 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(117), శ్రేయస్ అయ్యర్(105) శతకాలతో అదరగొట్టారు. శుభమన్ గిల్(80), రోహిత్ శర్మ(47) రాణించడంతో న్యూజిలాండ్ ముంగిట 398 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా ఉంచగలిగింది. చివరలో కేఎల్ రాహుల్ 20 బంతుల్లో 39 పరుగులతో రాణించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ 3 వికెట్లు పడగొట్టి 100 పరుగులు సమర్పించగా.. బౌల్ట్ ఒక వికెట్ తీశాడు.
Also Read: Virat Kohli: చరిత్ర సృష్టించిన కింగ్ కోహ్లీ.. 50 సెంచరీలతో సచిన్ రికార్డు బ్రేక్
Also Read
- Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Off The Record: జగన్‌కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- Pawan Kalyan Ayurvedic Treatment: కుడి భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ.. కేరళం చేరుకున్న పవన్ కల్యాణ్..
ఈ మ్యాచ్‌లో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టడం ద్వారా విరాట్ కోహ్లీ కొత్త చరిత్ర సృష్టించాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డును సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 50 సెంచరీలతో సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా విరాట్ నిలిచాడు. న్యూజిలాండ్ పై సెంచరీ తో వన్డేల్లో 50 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు కోహ్లీ. 49 సెంచరీలు చేసిన సచిన్ రికార్డ్‌ని కోహ్లీ బ్రేక్ చేశాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికాపై విరాట్ కోహ్లీ సెంచరీ చేయడం ద్వారా సచిన్ టెండూల్కర్ 49 సెంచరీలను సమం చేశాడు. న్యూజిలాండ్‌పై సెంచరీ చేయడం ద్వారా, వన్డే క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ప్రపంచంలోనే తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ మూడో స్థానంలో ఉన్నాడు. వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో రోహిత్ 31 సెంచరీలు చేశాడు.
Also Read: Visakhapatnam: 101 సంవత్సరాల వయసులో 3 స్వర్ణ పథకాలను సాధించిన విశాఖ వాసి..
శ్రేయస్ అయ్యర్ కూడా బ్యాట్‌ను ఝులిపించి భారత్ భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. 67 బంతుల్లోనే సెంచరీ బాది భారత్‌కు భారీ స్కోరును కట్టబెట్టాడు. శ్రేయస్ 70 బంతుల్లో 8 సిక్సర్లు, 4 ఫోర్లతో 105 పరుగులు చేసి వెనుదిరగగా.. అనంతరం వచ్చిన కేఎల్ రాహుల్(39) కూడా వీరబాదుడు బాదాడు. గత ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌పై సెమీస్‌లో ఓడిపోయిన భారత జట్టు.. ఈ సారి ప్రతీకారం తీర్చుకుంటుందో వేచి చూడాల్సిందే.
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!