Site icon NTV Telugu

India Pak War : భారత్-పాక్ తొలి శాంతి చర్చలపై సర్వత్రా ఉత్కంఠ

India Pak

India Pak

India Pak War : సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రేపు జరగనున్న భారత్-పాకిస్థాన్ ల తొలి సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం సరిహద్దుల్లో నిశ్శబ్ద వాతావరణం నెలకొన్నప్పటికీ, ఇరు దేశాల మధ్య జరగనున్న “తొలి శాంతి చర్చలు” ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఇరు దేశాల “మిలిటరీ ఆపరేషన్స్” డైరెక్టర్ జనరల్స్ స్థాయిలో ఈ చర్చలు జరగనున్నాయి. అయితే, ఈ చర్చలు ప్రస్తుతానికి కేవలం కాల్పుల విరమణకు మాత్రమే పరిమితం కానున్నాయి. ఇతర ముఖ్యమైన అంశాలపై తదుపరి దశలో చర్చలు జరిగే అవకాశం ఉంది.

భారత్ ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. రక్షణ బలగాలను పూర్తి స్థాయిలో అప్రమత్తం చేస్తూనే, వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. పాకిస్తాన్ ఒకవేళ దాడులకు పాల్పడితే, వాటికి దీటుగా ప్రతిదాడులు చేయాలని భారత రక్షణ బలగాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయబడ్డాయి. మరోవైపు, వీసాల రద్దు , సింధు జలాల ఒప్పందం రద్దు వంటి ఆంక్షలు కొనసాగనున్నాయి. రాబోయే రోజుల్లో భారత్ మరిన్ని ఆంక్షలను చర్చల ద్వారా పాకిస్తాన్‌పై విధించే అవకాశం ఉంది.

VishwakSen : ‘కల్ట్’ చూపిస్తానంటోన్న విశ్వక్ సేన్..

పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారు స్వఫోన్ చేసి కాల్పుల విరమణ ప్రతిపాదన చేయడం గమనార్హం. ఇటీవల జరిగిన పరిణామాల్లో పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించుకుంది. భారత వైమానిక దాడుల్లో 11 పాకిస్తాన్ వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. ప్రతిదాడుల్లో పాకిస్తాన్ యొక్క “ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్” కూడా తీవ్రంగా నష్టపోయాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని 9 తీవ్రవాద స్థావరాలను కూడా భారత్ ధ్వంసం చేసింది. భారత వైమానిక మెరుపు దాడుల్లో ఐదుగురు కరుడుగట్టిన తీవ్రవాదులు హతమయ్యారు. సైనికపరంగా పాకిస్తాన్ ఊహించని స్థాయిలో నష్టపోయింది.

అమెరికా మధ్యవర్తిత్వం , అంతర్జాతీయ ద్రవ్య నిధి ద్వారా పాకిస్తాన్‌కు 1 బిలియన్ డాలర్ల రుణ మంజూరు వంటి అంశాలు కూడా పొరుగు దేశంపై ఒత్తిడి తెచ్చాయి. అంతర్జాతీయంగా ఒంటరిగా మారిన పాకిస్తాన్‌కు ప్రపంచ దేశాల నుండి మద్దతు కరువైంది. సైనిక చర్యలను నిలుపుదల చేయాలని ఇరు దేశాలు నిర్ణయించుకున్న తర్వాత, చైనా పాకిస్తాన్ యొక్క సార్వభౌమాధికారాన్ని కాపాడుతామని ప్రకటన చేయడం విశేషం. మరింత నష్టపోకుండా ముందు జాగ్రత్త పడిన పాకిస్తాన్, చర్చల ద్వారా శాంతికి చేతులు చాచింది.

TG EAPCET 2025 Results: ఈఏపీసెట్‌ పలితాలు వచ్చేశాయ్..

Exit mobile version