India Pak War : సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రేపు జరగనున్న భారత్-పాకిస్థాన్ ల తొలి సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం సరిహద్దుల్లో నిశ్శబ్ద వాతావరణం నెలకొన్నప్పటికీ, ఇరు దేశాల మధ్య జరగనున్న “తొలి శాంతి చర్చలు” ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఇరు దేశాల “మిలిటరీ ఆపరేషన్స్” డైరెక్టర్ జనరల్స్ స్థాయిలో ఈ చర్చలు జరగనున్నాయి. అయితే, ఈ చర్చలు ప్రస్తుతానికి కేవలం కాల్పుల విరమణకు మాత్రమే పరిమితం…
భారతదేశం ప్రతీకార చర్యతో పాకిస్థాన్ పూర్తిగా భయపడింది. మధ్యవర్తిత్వం కోసం అమెరికాను ఆశ్రయించింది. అమెరికా భారత్- పాక్ మధ్య మధ్యవర్తిత్వం వహించింది. పాకిస్థాన్ కాల్పుల విరమణకు అంగీకరించింది. భారత్-పాకిస్తాన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు.. "కాల్పుల విరమణకు భారత్-పాక్ అంగీకరించాయి.. భారత్-పాకిస్థాన్ మధ్య మధ్యవర్తిత్వం వహించాం.. రాత్రంతా భారత్-పాకిస్థాన్‌లతో చర్చలు జరిగాయి.. రెండు దేశాలకు నా అభినందనలు.. తక్షణమే కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి." అని ట్రంప్ పేర్కొన్నారు.