భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన ఆసియా కప్ మ్యాచ్ ప్రస్తుతం చర్చనీయాంశమైంది. దానికి కారణం.. హ్యాండ్‌షేక్. ఎందుకంటే టాస్ సమయంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సల్మాన్ అలీ అఘాతో కరచాలనం చేయలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా.. శివం దుబేతో కలిసి కెప్టెన్ సూర్య పాకిస్థాన్ జట్టును పట్టించుకోలేదు. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ‘హ్యాండ్ షేక్ వివాదం’ అంశాన్ని ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) ముందు లేవనెత్తింది. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ఐసీసీ ప్రవర్తనా నియమావళిని, ఎంసీసీ క్రికెట్ స్ఫూర్తిని ఉల్లంఘించారని పీసీబీ పేర్కొంది. ఈ మ్యాచ్ రిఫరీని ఆసియా కప్ నుంచి వెంటనే తొలగించాలని పీసీబీ డిమాండ్ చేసింది. భారత జట్టు విషయంలో ఏసీసీ (ఆసియన్ క్రికెట్ కౌన్సిల్)కి ఫిర్యాదు చేయాలనే చర్చ కూడా జరిగింది. తాజాగా బీసీసీఐ నుంచి రెస్పాన్స్ వచ్చింది.
READ MLORE: Teja Sajja : తేజసజ్జా ఆ హీరోల లిస్టులో చేరిపోయాడోచ్..
ఈ అంశంపై ఓ జాతీయ మీడియా సంస్థ బీసీసీఐ కార్యదర్శి దేవ్జిత్ సైకియాతో మాట్లాడింది. ఏసీసీ, బీసీసీఐని సంప్రదించినట్లు వచ్చిన వార్తలు నిజమేనా? అని అడిగింది. ఈ అంశంపై తనకు ఎటువంటి సమాచారం లేదని.. జరగాల్సినది జరిగిపోయింది. ఇప్పుడు తమ దృష్టి టోర్నమెంట్‌పైనే ఉందని సైకియా సమాధానమిచ్చారు. వారు ఏమి చేయాలనుకుంటున్నారో అది చేయనివ్వండి. మనం రాబోయే మ్యాచ్‌లు ఆడాలి. ఈ విషయంలో నేను చెప్పడానికి ఏమీ లేదని స్పష్టం చేశారు.
కాగా.. ఈ అంశంపై ఇప్పటికే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించారు. తాము ఇక్కడికి కేవలం క్రికెట్ ఆడేందుకు మాత్రమే వచ్చామని తెలిపాడు. “పాక్‌కు సరైన సమాధానం ఇచ్చామని అనుకుంటున్నా. బీసీసీఐ, భారత ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నాం. జీవితంలో కొన్నిసార్లు క్రీడాస్ఫూర్తి కంటే ముందుండే విషయాలు ఉంటాయి. దానిని నేను పోస్ట్ ప్రెజెంటేషన్లోనే చెప్పా. పహల్గాం ఉగ్రదాడి బాధితులకు అండగా ఉన్నాం. మా ప్రగాఢ సానుభూతిని తెలియజేశాం. అలాగే, ఆపరేషన్ సిందూర్‌లో ధైర్యసాహసాలు ప్రదర్శించిన మన ఆర్మీకి అంకితం ఇచ్చాం. వారు మనందరికీ స్ఫూర్తినిస్తూనే ఉన్నారు. ఇప్పుడు డెడికేట్ చేయడానికి ఇంతకుమించిన మంచి సందర్భం మరొకటి లేదు.” అని సూర్యకుమార్ వ్యాఖ్యానించాడు. అని సూర్యకుమార్ తెలిపాడు.
READ MLORE: Medha School : సంచలనం.. మేధా స్కూల్ కరస్పాండెంట్ రిమాండ్.. కీలక అంశాలు వెలుగులోకి