భారత్‌పై పాకిస్థాన్ విషం చిమ్ముతూనే ఉంది. ఐక్యరాజ్యసమితిలో రామ మందిర అంశాన్ని మరోసారి లేవనెత్తింది. అయితే, ఈసారి అయోధ్య రామమందిరాన్ని మానేసినట్లు పాక్ తెలిపింది. దీంతో యూఎన్ జనరల్ అసెంబ్లీలో దాయాది దేశం చేసిన ప్రకటన విధ్వంసకరమని భారత్ అభివర్ణించింది. అలాగే, పాకిస్థాన్‌కు ఘాటైన సమాధానం ఇస్తూ.. అన్ని అంశాలలో పాకిస్థాన్ అత్యంత సందేహాస్పదమైన ట్రాక్ రికార్డ్ కలిగి ఉందని చెప్పుకొచ్చింది.
Read Also: Bhuvneshwar Kumar: చివరి ఓవర్‌లో ఎలాంటి చర్చ జరగలేదు: భువనేశ్వర్ కుమార్
ఇక, ఐక్యరాజ్యసమితిలో పాక్ రాయబారి మునీర్ అక్రమ్ ‘శాంతి సంస్కృతి’పై జనరల్ అసెంబ్లీలో ప్రసంగిస్తూ.. కాశ్మీర్, పౌరసత్వ (సవరణ) చట్టం, రామ్ మందిరం లాంటి అంశాలను ప్రస్తావిస్తూ భారతదేశానికి వ్యతిరేకంగా సుదీర్ఘ వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ పై యూఎన్ లో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ ఘాటుగా స్పందించారు. ఈ ప్రపంచవ్యాప్తంగా శాంతియుత వాతావరణం కోసం మేము ప్రయత్నించినప్పుడు.. మా దృష్టి నిర్మాణాత్మక సంభాషణపై ఉంటుందన్నారు. కాబట్టి మేము ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నామని చెప్పుకొచ్చారు.
Read Also: Health Tips : మామిడిపండ్లు తింటే బరువు పెరుగుతారా?
భారత్ నిరంతరం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పని చేస్తుందని కాంబోజ్ తెలిపారు. ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా చూడాలని తాము కోరుకుంటాం.. కానీ, పాకిస్థాన్ మాత్రం దానికి వ్యతిరేకంగానే ఉంటుందన్నారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా చర్చిలు, మఠాలు, గురుద్వారాలు, మసీదులు, దేవాలయాలతో సహా పవిత్ర స్థలాలపై పెరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. ఇక, భారతదేశంలో హిందూ, బౌద్ధ, జైన, సిక్కు మతాలకు జన్మస్థలం మాత్రమే కాదు, ఇస్లాం, జుడాయిజం, క్రైస్తవం, జొరాస్ట్రియనిజంలకు కూడా జన్మస్థలం అని భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ అన్నారు. ఇక, మతం ప్రాతిపదికన వేధింపులను ఎదుర్కొనే వారికి పాకిస్థాన్ ఆశ్రయం ఇస్తుందని మండిపడ్డారు.
