Ind Vs Ban: బంగ్లాదేశ్‌తో డిసెంబర్ 4న ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌కు 17 మంది సభ్యులతో కూడిన జట్టును భారత్ ప్రకటించింది. న్యూజిలాండ్ టూర్‌లో విశ్రాంతి తీసుకున్న రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ సీనియర్ త్రయం అంతర్జాతీయ జట్టులోకి తిరిగి వచ్చారు. సెలెక్టర్లు కుల్దీప్ సేన్, రజత్ పటీదార్, రాహుల్ త్రిపాఠి వంటి అద్భుతమైన అన్‌క్యాప్డ్ ఆటగాళ్లను కూడా జట్టులో చేర్చుకున్నారు. బంగ్లాదేశ్ చివరిసారిగా 2015లో భారత్‌కు వన్డే సిరీస్‌కు ఆతిథ్యం ఇచ్చింది. బంగ్లాదేశ్ జట్టు 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. రోహిత్‌సేన ఇప్పుడు చాలా బలంగా ఉంది. ఈ సిరీస్‌ను ఎలాగైనా దక్కించుకోవాలనే ఉత్సాహంతో ఉన్నారు.
ఇదిలా ఉండగా.. బంగ్లాదేశ్‌తో ఆదివారం నుంచి ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్‌కు ముందు భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా సీనియర్ పేసర్ షమీ ఈ సిరీస్ మొత్తానికి దూరం అయ్యాడు. బీసీసీఐ ఈ మేరకు ట్వీట్ చేసింది. భుజం గాయంతో షమీ ఇబ్బందిపడుతున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. షమీ స్థానంలో భారత యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌కు జట్టులో చోటు కల్పించారు. వన్డే సిరీస్‌తో పాటు టెస్ట్ సిరీస్‌కు కూడా షమీ దూరమయ్యే అవకాశాలు ఉండటం జట్టును ఆందోళన కలిగిస్తోంది. బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది.
Viral Video: బాల్‌ను మెరిపించడానికి కొత్త పద్ధతిని కనిపెట్టిన జో రూట్.. వీడియో వైరల్
భారత జట్టు ఇదే.. : రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైఎస్ కెప్టెన్), ధావన్, కోహ్లీ, రజత్ పాటిదార్, శ్రేయస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, పంత్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్, సిరాజ్, దీపక్ చాహర్, కుల్‌దీప్‌సేన్, ఉమ్రాన్ మాలిక్
