Tejas Mk-1A: భారత అమ్ముల పొదిలోకి తేజస్ కొత్త మార్క్ చేరనుంది. దేశ వైమానిక దళానికి కేంద్ర ప్రభుత్వం 97 తేజస్ యుద్ధ విమానాల బూస్టర్ డోస్‌ను ఇవ్వనుంది. ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ గురువారం హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఎఎల్)తో రూ.62,370 కోట్ల విలువైన ఒప్పందంపై సంతకం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ ప్రధాన ఒప్పందాన్ని ఆమోదించిన నెల తర్వాత, వైమానిక దళం బలోపేతం కోసం కొత్తగా 97 తేలికపాటి తేజస్ యుద్ధ విమానాలను కొనుగోలు ఒప్పందం జరిగింది.
READ ALSO: OG: ఓజీలో టైం ట్రావెల్.. చూసినోళ్లు ఇది అబ్జర్వ్ చేశారా బాసూ?
తేజస్ మార్క్ కనిపిస్తుంది…
ప్రభుత్వ యాజమాన్యంలోని ఏరోస్పేస్ కంపెనీకి లభించిన రెండవ కాంట్రాక్ట్ ఇది. ఫిబ్రవరి 2021లో రక్షణ మంత్రిత్వ శాఖ 83 తేజస్ Mk-1A ఫైటర్ జెట్ల కొనుగోలు కోసం HALతో ₹48 వేల కోట్ల ఒప్పందంపై సంతకం చేసింది. తేజస్ Mk-1A విమానం స్వీయ-రక్షణ కవచం, ఆధునిక నియంత్రణ యాక్యుయేటర్లు వంటి అధునాతన లక్షణాలను కలిగి ఉంటుందని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ యుద్ధ విమానం రూపకల్పనలో 64 శాతానికి పైగా స్వదేశీ వస్తువులను వాడుతున్నారు. భారత వైమానిక దళంలో వీటి రాక గేమ్-ఛేంజర్‌గా మారుతుందని రక్షణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఒప్పందం భారతదేశానికి వ్యూహాత్మకంగా కీలకమైనదిగా పరిగణిస్తున్నారు. తేజస్ వైమానిక దళం బలాన్ని పెంచడమే కాకుండా రక్షణ ఉత్పత్తిలో భారతదేశం స్వావలంబన లక్ష్యాన్ని వేగవంతం చేస్తుందని చెబుతున్నారు. ఇది బహుళ పాత్ర పోషించే యుద్ధ విమానాలు, అలాగే అధిక ప్రమాదకర వాతావరణంలో పనిచేయగలదని చెప్పారు. ఇది ఏక కాలంలో వాయు రక్షణ, సముద్ర నిఘా దాడి కార్యకలాపాల కోసం తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
గత ఒప్పందం డెలివరీ ఎప్పుడు?
2021లో ఫిబ్రవరి సంతకం చేసిన 83 తేజస్ మార్క్-1A విమానాల కోసం మొదటి ఒప్పందం ప్రకారం.. HAL ఫిబ్రవరి 2024 నుంచి ఫిబ్రవరి 2028 మధ్య విమానాలను డెలివరీ చేయాల్సి ఉంది. ఈ ఒప్పందం విలువ ₹46,898 కోట్లు. అయితే వైమానిక దళానికి ఇంకా ఇప్పటి వరకు ఒక్క విమానం కూడా అందలేదు. ఈ ఏడాది అక్టోబర్ నాటికి మొదటి రెండు విమానాలను డెలివరీ చేస్తామని HAL ఇటీవల ప్రకటించింది.
చాలా నెమ్మదిగా తేజస్ డెలివరీ..
చైనా, పాక్ నుంచి ఊహించని ముప్పు ఎదురైనప్పుడు భారత వద్ద ఉన్న 42.5 స్క్వాడ్రన్లు కూడా సరిపోవని భారత వైమానిక దళం అంతర్గత నివేదిక పేర్కొంది. తేజస్ అభివృద్ధి, డెలివరీ చాలా నెమ్మదిగా జరుగుతుందని రక్షణ వర్గాలు నొక్కి చెబుతున్నాయి. ఇటీవలి ఒక కార్యక్రమంలో ఎయిర్ మార్షల్ AP సింగ్ మాట్లాడుతూ.. యుద్ధ విమానాల పరంగా వైమానిక దళం చాలా బలహీనంగా ఉందని, భారత వైమానిక దళానికి ప్రతి సంవత్సరం కనీసం 40 కొత్త యుద్ధ విమానాలు అవసరమని అన్నారు.
మిగ్-21 ల స్థానంలో తేజస్..
ఈ విమానాల డెలివరీలు 2027-28లో ప్రారంభమవుతాయి. ఈ సింగిల్ ఇంజిన్ జెట్‌లు భారత వైమానిక దళం పాత మిగ్-21ల లోటును భర్తీ చేస్తాయని రక్షణ వర్గాలు పేర్కొన్నాయి. వైమానిక దళం అధికారిక బలం 42 కాగా, ప్రస్తుతం దాని వద్ద 31 స్క్వాడ్రన్లు మాత్రమే ఉన్నాయి. ప్రతి స్క్వాడ్రన్‌లో 16 నుంచి 18 యుద్ధ విమానాలు ఉంటాయి. పాకిస్థాన్ వద్ద ప్రస్తుతం 25 స్క్వాడ్రన్‌లు ఉన్నాయి. దాయదీ తన బలాన్ని మరింత పెంచుకోడానికి చైనా నుంచి 40 J-35A ఐదవ తరం స్టెల్త్ జెట్‌లను కొనుగోలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
READ ALSO: Sonam Wangchuk: సోనమ్ వాంగ్‌చుక్ అరెస్ట్.. లడఖ్ అల్లర్లపై కేంద్రం ఉక్కుపాదం..