China – Pakistan: పాకిస్థాన్‌కు మొదటి నుంచి అండగా ఉంటున్న చైనా ఇప్పుడు దాయాది దేశానికి షాక్ ఇచ్చిందా.. పాక్‌ను ముప్పు తిప్పలు పెడుతున్న టీటీపీకి ఉగ్రవాదులకు డ్రాగన్ ఆయుధాలను సరఫరా చేస్తుందనే ఆరోపణల్లో నిజం ఎంత. ఇటీవల పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా తదితర ప్రాంతాలలో డ్రోన్, క్వాడ్‌కాప్టర్ దాడులు విపరీతంగా పెరిగాయి. పలు అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం.. ఇట్టిహాద్-ఎ-ముజాహిదీన్ పాకిస్థాన్, హఫీజ్ గుల్ బహదూర్ గ్రూప్ వంటి గ్రూపులు ఈ సాంకేతికత ఆయుధాలను బహిరంగంగా ఉపయోగిస్తున్నాయని వెల్లడించాయి. పాకిస్థాన్‌కు అతిపెద్ద శత్రువు TTP కూడా ఈ డ్రోన్, క్వాడ్‌కాప్టర్ దాడులను విజయవంతంగా ప్రయోగిస్తుంది. ఇంతకీ ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ఈ ఆధునిక సాంకేతికత ఉగ్రవాదులకు ఎలా చేరాయి అనేది? ఆ విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: RRB Recruitment 2025: రైల్వేలో ఉద్యోగాల జాతర.. ఏకంగా 8,875 పోస్టులు.. అస్సలు వదులుకోకండి..
పెరుగుతున్న డ్రోన్, క్వాడ్‌కాప్టర్ల దాడులు..
పలు నివేదికల ప్రకారం.. మే 19న ఉత్తర వజీరిస్థాన్‌లోని హోర్ముజ్ గ్రామంలో జరిగిన డ్రోన్ దాడిలో ముగ్గురు పిల్లలు, ఒక యువకుడు మరణించారు. అలాగే నలుగురు గాయపడ్డారు. దాడిని ఆపడంలో భద్రతా సంస్థలు విఫలమయ్యాయని స్థానికులు ఆగ్రహించారు. ఈ దాడులు ఉగ్రవాద గ్రూపులు చేశాయని పాకిస్థాన్ సైన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. సైన్యం ప్రకటనపై ప్రజల కోపం తగ్గలేదు. బన్ను జిల్లాలోని మార్యన్ పోలీస్ స్టేషన్‌పై కొన్ని నెలల్లోనే దాదాపు 13 సార్లు క్వాడ్‌కాప్టర్లు దాడి చేశాయి. ఈ దాడుల్లో పది మంది పోలీసులు గాయపడ్డారు. ఉగ్రవాదులు సాధారణ వాణిజ్య క్వాడ్‌కాప్టర్లను ఆయుధాలుగా మార్చారని పాక్ పోలీసులు చెబుతున్నారు. వారు స్థానికంగా తయారు చేసిన పేలుడు పదార్థాలను వాటిలో నింపి టార్గెట్లపైకి విసురుతున్నారని చెబుతున్నారు. ఈక్రమంలో కొన్నిసార్లు పేలుడు పదార్థాలు బ్లాస్ట్ కావడంలో విఫలమవుతున్నాయని, కానీ భయానక వాతావరణం నిత్యం పెరుగుతూనే ఉందని పేర్కొన్నారు.
భద్రతా దళాలకు పెను సవాల్..
ఉగ్రవాదుల నుంచి ఊహించిన ఈ దాడులు భద్రతా దళాలకు పెను సవాల్‌ను సృష్టిస్తున్నాయి. ఈ దాడుల మధ్య భద్రతా సంస్థలు, పోలీసు పోస్టులు, స్థావరాలను బలోపేతం చేస్తున్నాయి. ఇప్పటికే యాంటీ-డ్రోన్ టెక్నాలజీని మోహరించడం, ఆధునిక ఆయుధాలు అందించడం వంటి చర్యలను చేపట్టారు. ఇప్పటివరకు రెండు క్వాడ్‌కాప్టర్‌లను కాల్చివేసినట్లు పాక్ సైన్యం పేర్కొంది. అయినప్పటికీ ఈ ప్రాంతంలో చౌకైన చైనీస్ క్వాడ్‌కాప్టర్‌లు నిరంతరం వాటి ఉనికి చాటుకుంటూ ఈ ప్రాంతం అంతటా భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి.
ఈ ఆయుధాలు చైనా నుంచి వస్తున్నాయా..
ఉగ్రవాదులు ఉపయోగించే క్వాడ్‌కాప్టర్లు అమెరికన్ మిలిటరీ డ్రోన్‌ల మాదిరిగా కాకుండా, చౌకైన చైనా డ్రోన్‌లని పలు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నివేదికల ప్రకారం.. తాలిబన్లతో అనుబంధంగా ఉన్న గ్రూపులు వీటిని కొనుగోలు చేసి, పేలుడు పదార్థాలతో సన్నద్ధం చేసి, దాడులలో ఉపయోగిస్తున్నట్లు తెలిపాయి. సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న పలు వీడియోలు చూపించి.. ప్లాస్టిక్ బాటిళ్లలో పేలుడు పదార్థాలను నింపి, బ్యాడ్మింటన్ షటిల్స్ వంటి వస్తువులకు ఎలా జత చేయాలో, వీటిని డ్రోన్‌ల ద్వారా ఎలా టార్గెట్‌పై కచ్చితమైన లక్ష్యాలపై పేల్చాలో ట్రైనింగ్ ఇస్తున్నట్లు వెల్లడించాయి. ఈ సాంకేతికత చౌకైనది మాత్రమే కాకుండా సులభంగా అందుబాటులో ఉంటుంది, దీంతో ఉగ్రవాదులు దీనిని సులభంగా స్వీకరించవచ్చని ఈ నివేదికలు చెతున్నాయి.
READ ALSO: Gold Medal Prisoner: జైల్లో స్టూడెంట్ నెం.1.. గోల్డ్ మెడల్ కొట్టిన జీవిత ఖైదీ..