NTV Telugu Site icon

World Cup 2023: ప్రపంచకప్ 2023 సెమీస్ చేరే జట్లు ఇవే.. ఐదవ టీమ్ పాకిస్థాన్!

Pakistan Team

Pakistan Team

Former India captain Sourav Ganguly Picks 5 Semi-Finals Teams for World Cup 2023: భారత గడ్డపై అక్టోబర్‌ 5 నుంచి నవంబర్‌ 19 వరకు వన్డే ప్రపంచకప్ 2023 జరగనున్న విషయం తెలిసిందే. సొంత గడ్డపై మ్యాచ్‌లు జరగనున్న నేపథ్యంలో టీమిండియా ఫెవరేట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. భారత్‌తో పాటుగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ కూడా పటిష్టంగా ఉన్నాయి. మెగా టోర్నీలో సెమీస్ చేరే జట్లేవో అని మాజీలు తమ అభిప్రాయాలు చెపుతున్నారు. తాజాగా బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రపంచకప్ 2023లో సెమీస్ చేరే జట్లు ఏవో అంచనా వేశాడు.

రెవ్‌స్పోర్ట్జ్‌తో మాట్లాడుతూ సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ… ‘ప్రపంచకప్ 2023లో సెమీ-ఫైనల్‌ చేరే జట్లేవో చెప్పడం చాలా కష్టం. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్ సెమీస్ చేరతాయని అనుకుంటున్నా. మెగా టోర్నీల్లో న్యూజిలాండ్‌ను ఎప్పటికీ తక్కువ అంచనా వేయకూడదు. ఇది ఇప్పటికే చాలాసార్లు రుజువైంది. సెమీస్ ఆడేవి నాలుగు జట్లే అయినా.. ఐదో జట్టుగా నేను పాకిస్థాన్‍ను కూడా ఎంచుకుంటున్నా. పాకిస్థాన్ అర్హత సాధిస్తే.. ఈడెన్ గార్డెన్స్‌లో ఇండో-పాక్ సెమీ-ఫైనల్ ఉంటుంది’ అని అన్నాడు.

Also Read: OPPO Reno 10 Series Launch: నేడే ఒప్పో రెనో 10 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్స్ డీటెయిల్స్ ఇవే!

ఐసీసీ ఈవెంట్లలో నాకౌట్ మ్యాచ్‌లలో భారత్ ఒత్తిడికి గురవుతుందనే విషయంపై సౌరవ్ గంగూలీ స్పందించాడు. ‘కొన్నిసార్లు ఐసీసీ ఈవెంట్లలో బాగా రాణించలేదు. అయితే ఇది మానసిక ఒత్తిడి వలన అని నేను భావించట్లేదు. ప్రణాళికలు అమలు సరిగ్గా అమలు చేయకపోవడం వల్లే ఓటములు ఎదురయ్యానని నేను అనుకుంటున్నా. ప్రస్తుతం మానసికంగా బలమైన ప్లేయర్స్ ఉన్నారు. ఈసారి నాకౌట్ మ్యాచ్‌లో విజయం సాధిస్తారు. కనీసం మేము ఛాంపియన్ షిప్ ఫైనల్స్‌కు అర్హత సాధించాము. అది కూడా ఒక ఘనత. ఇప్పుడు మాకు మంచి ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. మేము ఈసారి ఫైనల్ చేరుతాం’ అని దాదా ధీమా వ్యక్తం చేశారు.

‘ఒత్తిడి ఎప్పుడూ ఉంటుంది. రోహిత్ శర్మ వన్డే ప్రపంచకప్‌ 2019లో ఐదు సెంచరీలు చేశాడు. అప్పుడు కూడా అతనిపై ఒత్తిడి ఉండేదని నేను అనుకుంటున్నాను. నేను, రాహుల్ ద్రవిడ్ ఆడుతున్న రోజుల్లో మంచి ప్రదర్శన చేయాలనే ఒత్తిడి మాపై ఉండేది. ఇప్పుడు రాహుల్ భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉన్నందున.. అతనిపై ఒత్తిడి ఉంది. ఒత్తిడి ఎపుడూ పోదు. ఒత్తిడి సమస్య ఓ సమస్య అని నేను అనుకోవడం లేదు’ అని సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు.

Also Read: Electricity Bill: పూరి గుడిసెకు రూ. 3,31,951 విద్యుత్తు బిల్లు.. షాక్‌లో కుటుంబ సభ్యులు!

Show comments