India Defence Deals: దేశ వ్యాప్తంగా ప్రజలందరూ దీపావళి సంబరాల్లో ఉన్నారు. కానీ భారత ఆర్మీకి నవంబర్ 23న నిజమైన దీపావళి పండగ జరగనుంది. ఇంతకీ ఈ నవంబర్ 23 ప్రత్యేకత ఏంటని ఆలోచిస్తున్నారా.. ఈ రోజున భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన DAC (రక్షణ సముపార్జన మండలి) సమావేశం కానుంది. ఈ సమావేశంలో కీలక రక్షణ ఒప్పందాలను చర్చించనున్నట్లు సమాచారం. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశంలో రూ.33 వేల కోట్ల విలువైన ఒప్పందాలపై చర్చ జరగనున్నట్లు రక్షణ వర్గాలు పేర్కొన్నాయి. ఈ రక్షణ ఒప్పందంలో చర్చకు రానున్న బాంబులు పొరపాటున పాకిస్థాన్‌పై పడితే ఇక భస్మమే అంటున్నారు విశ్లేషకులు..
READ ALSO: PAK vs SA: 38 ఏళ్ల వయసులో అరంగేట్రం.. 6 వికెట్లతో 92 ఏళ్ల రికార్డు బద్దలు!
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ సమావేశంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాల అధిపతులు పాల్గొననున్నారు. గతంలో రక్షణ కార్యదర్శి R.K. సింగ్ అధ్యక్షతన ఉన్న డిఫెన్స్ ప్రొక్యూర్‌మెంట్ బోర్డు (DPB) ఈ ఒప్పందాలన్నింటినీ ఆమోదముద్ర వేసింది. ఈ ప్రాజెక్టులు ఆత్మనిర్భర్ భారత్ చొరవలో భాగంగా దేశీయంగా అభివృద్ధి చేసిన ఆయుధ వ్యవస్థలు. వీటిలో ఆర్మీకి రాకెట్ లాంచర్లు, నేవీ, వైమానిక దళానికి సర్ఫేస్-టు-ఎయిర్ క్షిపణులు (MR-SAMలు), నాలుగు స్వదేశీ ల్యాండింగ్ ప్లాట్‌ఫామ్ డాక్ (LPD) నౌకల కోసం ₹33 వేల కోట్ల విలువైన భారీ ఒప్పందం ఉన్నాయి.
MR-SAM క్షిపణులు: భారత నావికాదళం, వైమానిక దళం రెండూ భారత్ డైనమిక్స్ తయారు చేసిన MR-SAM (మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్)ను అందుకోనున్నాయి. 100 కిలోమీటర్ల పరిధి కలిగిన ఈ క్షిపణి వ్యవస్థ శత్రు విమానాలు, క్షిపణులను నాశనం చేయగలవు. రెండు దళాలు 300 కంటే ఎక్కువ క్షిపణులను సొంతం చేసుకుంటాయని తెలుస్తుంది.
పినాకా మల్టీ-బారెల్ రాకెట్ లాంచర్ (MBRL): DRDO అభివృద్ధి చేసిన దాదాపు 90 కిలోమీటర్ల పరిధి కలిగిన పినాకా రాకెట్ వ్యవస్థ ఇప్పుడు భారత సైన్యం అమ్ముల పొదలో చేరడానికి సిద్ధంగా ఉంది. ఈ సమావేశంలో సుమారు వెయ్యి పినాకా రాకెట్లను సైన్యానికి అందించడానికి ఆమోదం లభించే అవకాశం ఉందని రక్షణ వర్గాలు పేర్కొన్నాయి.
ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ వెహికల్స్: కమాండ్ అండ్ కంట్రోల్ పరికరాల కోసం ప్రత్యేక వాహనాలను సైన్యం అభ్యర్థించింది. ఈ అభ్యర్థన సమావేశం ఎజెండాలో ఉందని తెలుస్తుంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్థాన్‌తో జరిగిన వివాదంలో ఈ వ్యవస్థ చాలా ప్రభావవంతంగా పని చేశాయని సైన్యం పేర్కొంది.
ల్యాండింగ్ ప్లాట్‌ఫామ్ డాక్ (LPD): అతిపెద్ద ఒప్పందం నాలుగు LPD నౌకలకు సంబంధించింది. 20 వేల టన్నుల కంటే ఎక్కువ బరువు ఉంటుంది. ఈ బరువు అనేది దాదాపు ఒక చిన్న విమాన వాహక నౌక పరిమాణం. వీటి ధర ₹33 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ ఒప్పందం దేశ నౌకానిర్మాణ రంగానికి పెద్ద ప్రోత్సాహాన్ని అందిస్తుందని రక్షణ వర్గాలు పేర్కొన్నాయి.
LPD నౌకలను సాధారణంగా భూమి, సముద్ర యుద్ధానికి ఉపయోగిస్తారు. అలాగే వీటిని సరఫరా నౌకలుగా కూడా ఉపయోగించవచ్చు. ఇది చాలా పెద్ద ఆర్థిక ఒప్పందం కాబట్టి, సమావేశం అనంతరం తుది ఆమోదం కోసం దీనిని భద్రతా క్యాబినెట్ కమిటీ (CCS)కి పంపుతారు. వాస్తవానికి DAC సమావేశం అక్టోబర్ 23న జరగాల్సి ఉంది. అలాగే నావల్ కమాండర్ల సమావేశం కూడా ఇదే తేదీన జరగాలి. కానీ ఈ రెండు ముఖ్యమైన సమావేశాలు దీపావళి తర్వాత నవంబర్ 23న నిర్వహించాలని తాజాగా నిర్ణయించారు. భారతదేశ త్రివిధ సైన్యాలకు అందించబోయే ఈ ఆయుధ వ్యవస్థలు దేశ రక్షణ తయారీ పరిశ్రమకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ తాజా రక్షణ వ్యవస్థల్లో ఏదైనా పాకిస్థాన్ భూభాగంలో పడితే దాయాది భస్మం కావాల్సిందే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు
READ ALSO: Pakistan Tomato Prices: దాయాది దేశంలో టమాటా మంటలు .. పాకిస్థాన్‌లో కిలో రూ.600-700!