Bangladesh: పాకిస్తాన్‌తో ప్రతిస్పందనల మధ్య భారత్ మరోవైపు బంగ్లాదేశ్‌పై కూడా దృష్టి సారించింది. భారత్‌కు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తున్న 4 బంగ్లాదేశీ మీడియా సంస్థలపై చర్యలు తీసుకుంది. ఈ విషయాన్ని బంగ్లాదేశీ మీడియానే స్వయంగా వెల్లడించింది. భారత్ తీసుకున్న ఈ చర్యతో బంగ్లాదేశ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఢాకా ట్రిబ్యూన్ కథనం ప్రకారం, బంగ్లాదేశ్‌కు చెందిన 4 వార్తా ఛానెళ్లను భారతదేశంలో బ్లాక్ చేయాలని నిర్ణయించారు. బ్లాక్ చేయాలని నిర్ణయించిన ఛానెళ్లలో జమునా టీవీ, యాక్టర్ టీవీ,…