INDIA Alliance March: ముందుగా లంచ్, ఆ తర్వాత నిరసన.. కాంగ్రెస్ SIR నిరసన ప్లాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
INDIA Alliance March: ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)ను వ్యతిరేకిస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ మూడో రోజు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి సిద్ధమైంది. తొలి రోజు ఢిల్లీలోని ఎన్నికల కార్యాలయం, రెండో రోజు జంతర్ మంతర్ వద్ద నిరసనకు దిగిన రాహుల్ గాంధీ అండ్ కో, గురువారం మరోసారి నిరసనలకు సిద్ధమయ్యారు.
ముందుగా లంచ్, ఆ తర్వాత నిరసన..
ముందుగా లంచ్ మీటింగ్, ఆ తర్వాత నిరసనకు ప్లాన్ ఇలా ప్రతిపక్షాల వ్యూహం కొనసాగుతోంది. బుధవారం సాగర్ రత్నలో ఇండియా కూటమి నేతలు లంచ్ మీటింగ్ చేసిన తర్వాత జంతర్ మంతర్ వద్ద నిరసరకు వెళ్లారు. గురువారం కూడా ఇదే తరహాలో బస్సుల్లో రాజ్‌ఘాట్‌కు బయలుదేరారు. గురువారం ఢిల్లీలోని కన్నాట్‌ప్లేస్‌లో ఉన్న మోయెట్స్ రెస్టారెంట్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇండియా కూటమి నేతలకు లంచ్ ఏర్పాటు చేశారు.
Also Read
- India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
- CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
- Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
- UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
లంచ్ తర్వాత విపక్ష నేతలు రాజ్‌ఘాట్‌కు వెళ్లి CEC జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా కొనసాగించారు. బుధవారం జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ పోలీసులు సెంట్రల్ ఢిల్లీలో, ముఖ్యంగా ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయంలో భద్రతను పెంచారు. ఇదే కాకుండా, జ్ఞానేష్ కుమార్ ఢిల్లీ నివాసం, ఎన్నికల సంఘం కార్యాలయం, ఆయన వ్యక్తిగత భద్రత కోసం అదనపు బలగాలను మోహరించారు.
రాహుల్, ప్రియాంకాలపై కేసులు..
ఇదిలా ఉంటే, బుధవారం నిరసనలకు సంబంధించి ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసులపై దాడి చేయడం, ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించడం వంటి ఆరోపణలపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. పలువురు కాంగ్రెస్ నేతలు, నిరసనల్లో పాల్గొన్న కార్యకర్తల పేర్లు కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. మంగళవారం ఆకాశవాణి భవన్‌లోకి అనుమతి లేకుండా ప్రవేశించారే ఆరోపణలపై రాహుల్, ప్రియాంకాలపై ఇప్పటికే కేసు నమోదైంది.
శుక్రవారం రాష్ట్రపతితో భేటీ..
శుక్రవారం మరో వ్యూహంతో ఇండియా కూటమి నేతలు ముందుకు వెళ్తున్నారు. కూటమి ఎంపీలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ కానున్నారు. ఇప్పటికే రాష్ట్రపతితో భేటీకి వీరికి అపాయింట్మెంట్ లభించింది. ఎన్నికల సంఘంపై ఫిర్యాదు చేసేందుకు 15 మంది ఎంపీలతో కూడిన ప్రతినిధి బృందం అపాయింట్మెంట్ కోరగా, రాష్ట్రపతి భవన్ 10 మంది ఎంపీల బృందానికి అనుమతినిచ్చింది. రాష్ట్రపతిని కలిసే బృందంలోలోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తదితరులు ఉండే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
INDIA Alliance March: ముందుగా లంచ్, ఆ తర్వాత నిరసన.. కాంగ్రెస్ SIR నిరసన ప్లాన్..
-
Super-Duper El Nino: ఎల్‌నినోపై మరోసారి బిగ్ అలర్ట్.. ప్రపంచం ఎర్రగా మారుతోందని హెచ్చరిక
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
-
IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!