NTV Telugu Site icon

India Follow On: ఫాలో‌ఆన్ గడ్డం తప్పించిన జస్ప్రీత్ బుమ్రా-ఆకాశ్ దీప్ జోడి

Ind Vs Aus India

Ind Vs Aus India

India Follow On: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా 3వ టెస్టు 4వ రోజు అంటే మంగళవారం (డిసెంబర్ 17)న వర్షం, బ్యాడ్ లైట్ కారణంగా ఆట చాలాసార్లు అంతరాయం కలిగింది. అయితే, ఇది భారత జట్టు దృష్టిలో మంచి విషయం అని చెప్పాలి. దీనికి కారణం ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ సెంచరీలతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇక నాల్గవ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 9 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఇంకా 193 పరుగులు వెనుకబడి ఉంది. ఇక ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. ఇప్పుడు మ్యాచ్‌ డ్రా చేసే అవకాశం ఎక్కువుగా కనపడుతుంది.

Also Read: IND vs AUS: ముగిసిన నాలుగో రోజు ఆట.. ఫాలో ఆన్ గండం తప్పించుకున్న టీమిండియా

ఇకపోతే జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్ చివరి వికెట్‌కు 33 పరుగులు జోడించి ఫాలో ఆన్ ముప్పును తప్పించారు. ప్రస్తుతం క్రీజులో జస్ప్రీత్ బుమ్రా 10 పరుగులతో, ఆకాశ్ దీప్ 27 పరుగులతో ఉన్నారు. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాల అర్ధ సెంచరీల ఆధారంగా ఈ మ్యాచ్‌లో ఫాలో-ఆన్‌ను కాపాడుకోవడంలో భారత్ విజయం సాధించింది. 66వ ఓవర్లో రవీంద్ర జడేజా ఔటవడంతో టీమిండియా ఫాలోఆన్ నుంచి తప్పించుకోలేక పోయినట్లే అనిపించింది. అయితే బుమ్రా, ఆకాశ్‌దీప్‌లు అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. ఆటగాళ్లిద్దరూ సానుకూల దృక్పథంతో బ్యాటింగ్ చేశారు. కమిన్స్ వేసిన బంతికి బుమ్రా అద్భుతమైన సిక్సర్ కొట్టగా, ఆకాశ్‌దీప్ కూడా స్వేచ్ఛగా స్ట్రోక్స్ ఆడాడు. రోజు ఆట ముగిసే సమయానికి ఆకాశ్‌దీప్ 2 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 27 పరుగులు చేశాడు. మరోవైపు బుమ్రా కూడా ఒక సిక్సర్ సహాయంతో 10 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మొత్తానికి వీరిద్దరి మధ్య 39 పరుగుల భాగస్వామ్యం టీమిండియాకు కీలకంగా మారింది.

Also Read: One Nation One Election: జేపీసీకి జమిలి ఎన్నికల బిల్లు పంపడంపై లోక్‌సభలో ఓటింగ్..

Show comments