NTV Telugu Site icon

IND vs AFG: ఇండియా-అప్ఘనిస్తాన్ మ్యాచ్.. ఆ జట్టుకే విజయావకాశాలు

Ind Vs Afg

Ind Vs Afg

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ సూపర్-8లో నేడు టీమిండియా-అఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగనుంది. బార్బడోస్లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో ఈ మ్యాచ్ జరుగనుంది. ఇండియా-అప్ఘనిస్తాన్ తలపడిన టీ20 మ్యాచ్లలో టీమిండియా ఓడిపోలేదు. రెండు జట్ల మధ్య మొత్తం 8 మ్యాచ్లు జరిగాయి. అందులో టీమిండియా 6 మ్యాచ్లు గెలిచింది. ఒక మ్యాచ్ ఫలితం రాలేదు. ఒక మ్యాచ్ ఫలితం కోసం సూపర్ ఓవర్ నిర్వహించారు. సూపర్ ఓవర్ మ్యాచ్లో టీమిండియా గెలిచింది. దీంతో.. అప్ఘనిస్తాన్తో ఆడిన మొత్తం 8 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లలో టీమిండియా 7 గెలిచింది. అందుకే.. ఈరోజు జరిగే మ్యాచ్లో కూడా టీమిండియాకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

CM Chandrababu: 5 కోట్ల మంది ఆంధ్రులకు అమరావతి చిరునామా.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

అఫ్ఘానిస్తాన్కు బౌలింగే బలం..
మరోవైపు.. ఈ మెగా టోర్నీలో అఫ్ఘాన్ జట్టు అద్భుతంగా ఆడింది. ఆ జట్టు బౌలింగ్ ప్రదర్శన అద్భుతంగా ఉంది. లీగ్ రౌండ్ లో వెస్టిండీస్ తో మ్యాచ్ ను పక్కన పెడితే.. మిగిలిన మూడు జట్లను 100 పరుగుల మార్కును కూడా దాటించలేదు.

టీ20 మ్యాచ్లలో భారత్-అప్ఘనిస్తాన్ హెడ్ టు హెడ్..
రెండు జట్ల మధ్య మొదటి టీ20 అంతర్జాతీయ మ్యాచ్ 2010 మే 1న జరిగింది. ఈ మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో ఈజీగా విక్టరీ సాధించింది. ఆ తర్వాత 2012లో ఇరు జట్లు తలపడగా.. భారత్ 23 పరుగుల తేడాతో సులువైన విజయాన్ని నమోదు చేసుకుంది. ఆ తర్వాత 2021 వరకు ఇరు జట్ల మధ్య ఎలాంటి టీ20 మ్యాచ్ జరగలేదు. 2021 టీ20 ప్రపంచ కప్లో ఇరు జట్లు ముఖాముఖి తలపడ్డాయి. ఈ మ్యాచ్లో భారత్ 66 పరుగుల తేడాతో గెలుపొందింది. 2022లో భారత్ 101 పరుగుల భారీ తేడాతో అప్ఘనిస్తాన్ ను ఓడించింది.

ఆసియా క్రీడల్లో భారత్ వర్సెస్ అప్ఘనిస్తాన్ మ్యాచ్ ఫలితం తెలియలేదు. ఆ తర్వాత.. అఫ్ఘాన్ జట్టు ఈ సంవత్సరం ప్రారంభంలో ఇండియాలో సందర్శించి మూడు మ్యాచ్ల టీ20 అంతర్జాతీయ సిరీస్ ను ఆడింది. తొలి రెండు మ్యాచ్లలో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించగా.. మూడో మ్యాచ్ టై అయింది. ఆ తర్వాత ఇరు జట్ల మధ్య జరిగిన తొలి సూపర్ ఓవర్ కూడా టై అయింది. రెండో సూపర్ ఓవర్లో భారత్ విజయం సాధించి.. 3-0తో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది.