India vs Afghanistan: భారత్‌కు కలిసొచ్చిన వర్షం.. మ్యాచ్ ఆడకుండానే సెమీస్‌కు దూసుకెళ్లిన టీమిండియా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Afghanistan: జపాన్‌లోని నాగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో వర్షం ఆటంకం కలిగించింది. భారత్, ఆఫ్ఘనిస్థాన్ పురుషుల క్రికెట్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వాన కారణంగా రద్దైంది. దీంతో మెరుగైన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా భారత జట్టు నేరుగా సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లింది. నిజానికి మ్యాచ్ ప్రారంభానికి ముందు కాస్త వర్షం తగ్గడంతో కవర్లు తొలగించకపోయినా ఆటగాళ్లు మైదానంలోకి వచ్చారు. త్వరలోనే మ్యాచ్ మొదలవుతుందని అంతా అనుకుంటున్న సమయంలో మళ్లీ వాన మొదలైంది. ఎంతకీ వర్షం తగ్గకపోవడంతో చేసేదేమీ లేక మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు, అధికారులు చివరకు ప్రకటన చేశారు. ర్యాంకింగ్స్ పరంగా భారత్ ముందంజలో ఉండటంతో మన టీమ్‌కు సెమీస్ బెర్త్ సులువుగా దక్కింది.
ఇక, గతంలో హ్యాంగ్జౌ ఆసియా క్రీడల్లో కూడా సరిగ్గా ఇలాగే వర్షం వల్ల మ్యాచ్ రద్దై భారత జట్టుకు స్వర్ణ పతకం దక్కింది. ఇప్పుడు మళ్లీ అదే రిపీట్ కావడంతో ఆఫ్ఘనిస్థాన్ జట్టు తీవ్ర నిరాశకు గురవ్వగా, మన టీమ్‌కు మాత్రం ఇది పెద్ద ఉపశమనంలా మారింది. ఈ దెబ్బతో భారత ఆటగాళ్లకు కాస్త విశ్రాంతి లభించడమే కాకుండా, జపాన్‌లోని పండుగ వాతావరణాన్ని ఆస్వాదించే అవకాశం దక్కింది. అంతేకాకుండా, అక్కడ జరుగుతున్న ఇతర ఆటల్లో పోటీపడుతున్న భారత్ అథ్లెట్లను ప్రత్యక్షంగా చూస్తూ వారిని ప్రోత్సహించేందుకు మన క్రికెటర్లకు తగినంత సమయం దొరికినట్లయింది.
Also Read
- Lovely Professional University: క్యాంపస్‌లో చెలరేగిన హింస.. 10 రోజుల పాటు క్లాసులు బంద్, మిడ్‌టర్మ్ పరీక్షలు వాయిదా!
- Godavari Floods: గోదావరిలో పెరిగిన వరద ఉధృతి.. లంక గ్రామాలకు రాకపోకలు బంద్..
- Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
- Vijayawada CI Ali Death Case: సీఐ అలీ మృతి కేసులో కీలక పరిణామం.. కానిస్టేబుల్ ఫిర్యాదుతో..!
ఆఫ్ఘనిస్థాన్ స్క్వాడ్: మహ్మద్ అక్రమ్, హసన్ ఈసాఖిల్, కరీం జనత్, ఫైసల్ షినోజాదా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ ఇషాక్(w), దర్విష్ రసూలి(c), నంగేలియా ఖరోటీ, అబ్దుల్లా అహ్మద్జాయ్, ఫరీదూన్ దావూద్జాయ్, అరబ్ గుల్ అహ్మద్జాయ్, ఎఫ్. ఇమ్రాన్ మీర్
భారత జట్టు: సంజు శాంసన్(w), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్(c), తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్, యశ్ ఠాకూర్, వైభవ్ సూర్యవంశీ, విప్రజ్ నిగమ్
తాజావార్తలు
-
India vs Afghanistan: భారత్‌కు కలిసొచ్చిన వర్షం.. మ్యాచ్ ఆడకుండానే సెమీస్‌కు దూసుకెళ్లిన టీమిండియా..!
-
Electronics Price Hike: టీవీ, ఏసీ, ఫ్రిజ్ ధరలు పెరిగే అవకాశం.. అక్టోబర్ 1 నుంచి కొత్త ధరలు
-
Virat Kohli: తల దించుకోవాలి.. సాకులు చెప్పొద్దు.. పరుగెత్తను అంటే కుదరదు!
-
Lovely Professional University: క్యాంపస్‌లో చెలరేగిన హింస.. 10 రోజుల పాటు క్లాసులు బంద్, మిడ్‌టర్మ్ పరీక్షలు వాయిదా!
-
Godavari Floods: గోదావరిలో పెరిగిన వరద ఉధృతి.. లంక గ్రామాలకు రాకపోకలు బంద్..
ట్రెండింగ్
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!