NTV Telugu Site icon

Rohit Sharma: ఎంఎస్ ధోనీని అధిగమించిన రోహిత్ శర్మ!

Rohit Sharma Close

Rohit Sharma Close

Captain Rohit Sharma surpassing Former India Skipper MS Dhoni: వెస్టిండీస్ పర్యటనలో భారత కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగిన రోహిత్.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ హాఫ్ సెంటిరీ బాదాడు. 2 సిక్స్‌లు, 9 ఫోర్ల సాయంతో 80 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే ఓపెనర్‌గా 27 టెస్టుల్లో 2000కు పైగా రన్స్‌ చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. అంతేకాదు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు.

మూడు ఫార్మాట్‌లలో కలిపి రోహిత్ శర్మ 443 మ్యాచుల్లో 17298 పరుగులు చేశాడు. 52 టెస్టుల్లో 3620 పరుగులు, 243 వన్డేల్లో 9825 పరుగులు, 148 టీ20ల్లో 3853 పరుగులు చేసాడు. దీంతో ఎంఎస్ ధోనీని రోహిత్ అధిగమించాడు. ధోనీ మూడు ఫార్మాట్‌లలో కలిపి 538 మ్యాచుల్లో 17266 పరుగులు చేశాడు. అంతేకాదు ఆస్ట్రేలియా సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ను కూడా రోహిత్ అధిగమించాడు. వార్నర్ 348 మ్యాచుల్లోనే 17267 పరుగులతో కొనసాగుతున్నాడు.

Also Read: Sweet Corn Health Benefits: స్వీట్‌కార్న్‌తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. వయసుని కూడా తగ్గిచేస్తుంది!

మూడు ఫార్మాట్‌లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రోహిత్ శర్మ 23వ స్థానంలో ఉన్నాడు. మరో 3 పరుగులు చేస్తే.. పాకిస్తాన్ మాజీ ప్లేయర్ మహమ్మద్‌ యూసఫ్ (17300)ను అధిగమిస్తాడు. రెండో టెస్టులో ఇంకా రెండో ఇన్నింగ్స్ ఉంది. ఇందులో బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోయినా.. విండీస్‌ పర్యటనలోనే వన్డే సిరీస్‌ కూడా ఉంది. దాంతో మూడు పరుగులు చేయడం రోహిత్‌కు పెద్ద కష్టమేమీ కాదు. యూసఫ్ రికార్డు బద్దలవ్వడం ఖాయం. మూడు ఫార్మాట్‌లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన జాబితాలో క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ 34357 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు.

Also Read: Kalki 2898 AD Glimpse: పోస్టర్ దెబ్బకి వణికిపోయిన ప్రభాస్‌ ఫాన్స్.. ఇప్పుడు కాలర్ ఎగరేస్తున్నారు!

Show comments