IND vs SL: భారత్, శ్రీలంక మ్యాచ్.. స్టేడియంలో కొట్టుకున్న క్రికెట్ ఫ్యాన్స్! వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fans Fights in India vs Sri Lanka Asia Cup 2023 Clash: ఆసియా కప్ 2023 సూపర్-4 స్టేజ్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 41 పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. మంగళవారం కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో క్రికెట్ ఫ్యాన్స్ గొడవ పడ్డారు. మ్యాచ్ ముగిసిన వెంటనే గ్యాలరీలో ఉన్న కొందరు ఫ్యాన్స్.. ఒకరిపై ఒకరు చేయిసుకున్నారు. శ్రీలంక జెర్సీలో ఉన్న ఓ వ్యక్తి.. పక్కనే ఉన్న కొందరిపై అటాక్ చేశాడు. ఆ సమయంలో పక్కనే ఉన్న ఫాన్స్ గొడవపడకుండా అడ్డుకున్నారు.
అటాక్ చేసింది శ్రీలంక ఫ్యాన్ అయినా.. అవతలి వారు ఎవరో తెలియరాలేదు. శ్రీలంక ఫాన్స్ లేదా భారత్ ఫాన్స్ అని తెలియలేదు. పక్కన ఉన్న వారు ఏమైనా హేళన చేస్తే.. శ్రీలంక ఫ్యాన్ రియాక్ట్ అయి ఉండొచ్చని సమాచారం. ఏదేమైనా ఈ ఘటనకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మ్యాచ్ ఓడిపోయిన అసహనంలో శ్రీలంక ఫ్యాన్ రియాక్ట్ అయ్యాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
- Vinayaka Vrata Katha: 'వినాయక చవితి' నాడు విజ్ఞాలను తొలిగించే 'వినాయక వ్రత కథ' మీకోసం..!
- Amol Muzumdar: భారత్‌కు ఆసియా కప్.. ట్రోఫీ మాత్రం వద్దంటూ బీసీసీఐ నిర్ణయం.. కోచ్ అమోల్ కీలక వ్యాఖ్యలు..
- Ganesh Chaturthi 2026: ఇంట్లో గణపతిని ప్రతిష్ఠిస్తున్నారా..? దిశ, విగ్రహం, పూజ విషయంలో ఈ నియమాలు తప్పక పాటించండి..
- Ganesh Chaturthi 2026: బొజ్జ గణపయ్య ప్రతిష్ఠకు శుభ ముహూర్తం.. పూజా సామగ్రి.. పూజా విధానం ఇదే!
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 213 పరుగులకు ఆలౌట్ అయింది. రోహిత్ శర్మ (53) హాఫ్ సెంచరీ చేశాడు. లక్ష్య ఛేదనలో శ్రీలంక 42 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. కుల్దీప్ యాదవ్ 4 వికెట్స్ పడగొట్టాడు. సూపర్-4లో టీమిండియాకు ఇది రెండో విక్టరీ కాబట్టి నేరుగా ఫైనల్ చేరింది. అంతకుముందు పాక్‌పై 228 రన్స్ తేడాతో గెలిచింది. గురువారం పాకిస్తాన్ జట్టుపై గెలిచిన లంక ఫైనల్ చేరింది.
India – Sri Lanka : Fans engage in fight.#AsiaCup2023 #AsiaCup pic.twitter.com/WqxsxMmSYe
— MrDeepak (@X_MrDeepak) September 13, 2023
తాజావార్తలు
-
Kollywood Sequel Flops : కోలీవుడ్ స్టార్స్‌కు కలిసిరాని సీక్వెల్స్.. జైలర్ 2 పరిస్థితి ఏంటో?
-
Toxic OTT: బాక్సాఫీస్‌లో షాక్.. ఇప్పుడు ఓటీటీలోకి యశ్ ‘టాక్సిక్’, స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
-
Oman Coast Ship Attack: ఒమన్ తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై దాడి.. ఒకరు గల్లంతు
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Jailer2 Telugu Rights : జైలర్ 2 తెలుగు రైట్స్ కోసం దిల్ రాజు vs నాగవంశీ
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!